హైదరాబాద్: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కీలక మార్పులు చేసింది. స్పిన్నర్ ఆదిల్ రషీద్, ఫజలక్ ఫరూఖీలను పక్కనపెట్టిన ఆరెంజ్ ఆర్మీ.. హెన్రీచ్ క్లాసెన్, మార్కో జాన్సెన్‌లను జట్టులోకి తీసుకుంది. దేశవాళీ స్పిన్నర్ మయాంక్ మార్కండేకు అవకాశం కల్పించింది.
టీమ్ కాంబినేషన్ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్ తెలిపాడు. బ్యాటింగ్ బలోపేతం కోసం ఆదిల్ రషీద్‌ను పక్కనపెట్టాల్సి వచ్చిందని టాస్ సందర్భంగా చెప్పుకొచ్చాడు. 'మేం ముందుగా బౌలింగ్ చేయాలనుకుంటున్నాం. చేజింగ్‌ను మేం ఇష్టపడుతున్నాం. బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్.

బౌలింగ్ అద్భుతంగా చేస్తామని ఆశిస్తున్నా. జట్టు కూడా చాలా మెరుగ్గా కనిపిస్తోంది. ఇక్కడి వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంది. మా తొలి విజయాన్ని నమోదు చేస్తామని ఆశాభావంతో ఉన్నా. జట్టులో మార్పులు చేశాం. హెన్రీచ్ క్లాసెన్, మయాంక్ మార్కండే జట్టులోకి వచ్చారు.'అని ఎయిడెన్ మార్క్‌రమ్ చెప్పుకొచ్చాడు.
మరోవైపు టాస్ గెలిస్తే తాను బ్యాటింగే ఎంచుకునేవాడినని పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ అన్నాడు. ఇక్కడ డ్యూ ప్రభావం కనిపించలేదని, భారీ లక్ష్యాన్ని సన్‌రైజర్స్ ముందు ఉంచితే సరిపోతుందన్నాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో హైదరాబాద్ చేజింగ్ చేయలేకపోయిందని, వారిని ఒత్తిడిలో ఉంచితే విజయం సాధించవచ్చన్నాడు.
తుది జట్లు:
సన్‌రైజర్స్ హైదరాబాద్: మయాంక్ అగర్వాల్, హరీ బ్రూక్, రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్క్‌రమ్(కెప్టెన్), హెన్రీచ్ క్లాసెన్(కీపర్), వాషింగ్టన్ సుందర్, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్, టీ నటరాజన్
పంజాబ్ కింగ్స్: శిఖర్ ధావన్(కెప్టెన్), ప్రభ్ సిమ్రాన్ సింగ్, మాథ్యూ షార్ట్, జితేశ్ శర్మ(కీపర్), షారూఖ్ ఖాన్, సామ్ కరణ్, నాథన్ ఎల్లిస్, మోహిత్ రాతీ, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్