For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

SRH vs MI: చేతులెత్తేసిన హార్దిక్ పాండ్యా.. కెప్టెన్సీ చేసిన రోహిత్ (వీడియో)

ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా చేతులెత్తేసాడు. కెప్టెన్సీ చేయలేక తన బాధ్యతలను మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు అప్పగించాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా తడబడ్డాడు. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌పై సన్‌రైజర్స్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగడంతో అయోమయానికి గురయ్యాడు.

సన్‌రైజర్స్ బ్యాటర్లను కట్టడి చేసేందుకు మ్యాచ్ మధ్యలోనే తన కెప్టెన్సీ బాధ్యతలను రోహిత్ శర్మకు అప్పగించాడు. దాంతో రోహిత్ శర్మ జట్టును నడిపించాడు. బౌలింగ్ మార్పులతో పాటు ఫీల్డ్ సెట్ చేశాడు. ఈ క్రమంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యాను బౌండరీ లైన్ వద్దకు పరుగెత్తించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Rohit Sharma takes over field settings

ఇక ఈ వీడియోపై ఫ్యాన్స్ తమదైన శైలిలో కామెంట్ చేస్తున్నారు. గత మ్యాచ్‌లో రోహిత్ శర్మను హార్దిక్ పాండ్యా బౌండరీ లైన్ వద్దకు పరుగెత్తించినందుకు ప్రతీకారం తీర్చుకున్నాడని కామెంట్ చేస్తున్నారు. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ వదిలేసి రోహిత్ శర్మకు అప్పజెప్పడం ఉత్తమమని సూచిస్తున్నారు.

ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చరిత్ర సృష్టించింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ నమోదు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆరెంజ్ ఆర్మీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 277 పరుగుల భారీ స్కోర్ చేసింది.

ట్రావిస్ హెడ్(24 బంతుల్లో 9 ఫోర్లు 3 సిక్స్‌లతో 62), అభిషేక్ శర్మ(23 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్‌లతో 63), హెన్రీచ్ క్లాసెన్(34 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్‌లతో 80 నాటౌట్) విధ్వంసకర హాఫ్ సెంచరీలతో చెలరేగగా.. ఎయిడెన్ మార్క్‌రమ్(28 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 42 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో హార్దిక్ పాండ్యా, కోయిట్జీ, పియూష్ చావ్లా తలో వికెట్ తీసారు.

సన్‌రైజర్స్ నమోదు చేసిన ఈ భారీ స్కోర్.. ఐపీఎల్‌లోనే కాకుండా ఫ్రాంచైజీ క్రికెట్‌లోనే హయ్యెస్ట్ స్కోర్ కావడం విశేషం. ఈ క్రమంలో ఆరెంజ్ ఆర్మీ 11 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది. 2013లో ఆర్‌సీబీ నమోదు చేసిన 263/5 స్కోర్ ఇప్పటి వరకు అత్యధికంగా ఉండగా.. తాజా ఇన్నింగ్స్‌తో సన్‌రైజర్స్ అధిగమించింది.

Story first published: Wednesday, March 27, 2024, 22:41 [IST]
Other articles published on Mar 27, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+