Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH vs MI: ఇషాన్ కిషన్ ఔట్.. అంపైర్ ఘోర తప్పిదం!

ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఔటవ్వకుండానే వెనుదిరగడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఆటగాళ్లు అప్పీల్ చేయకుండానే.. అంపైర్ తన నిర్ణయాన్ని చెప్పకముందే ఇషాన్ కిషన్ పెవిలియన్ బాట పట్టాడు. ఇషాన్ కిషన్ నిర్ణయంతో వైడ్ ప్రకటించేందుకు సిద్దమైన ఫీల్డ్ అంపైర్ వినోద్ సెషన్.. తన నిర్ణయాన్ని మార్చుకొని ఔటిచ్చాడు. కానీ రిప్లేలో నౌటౌట్ అని తేలింది. దాంతో ఇషాన్ కిషన్‌తో పాటు అంపైర్‌‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి.

అసలేం జరిగిందంటే..?
దీపక్ చాహర్ వేసిన వేసిన మూడో ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ తొలి బంతిని ఇషాన్ కిషన్ లెగ్ సైడ్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బ్యాట్‌ను మిస్సైన బంతి కీపర్ చేతిలో పడింది. ఆ వెంటనే ఇషాన్ కిషన్ క్రీజును వదిలాడు. వైడ్ ఇచ్చేందుకు సిద్దమైన అంపైర్ వినోద్.. ఇషాన్ కిషన్‌ క్రీజును వీడటం చూసి తన నిర్ణయాన్ని మార్చుకొని ఔటిచ్చాడు. ముంబై ఆటగాళ్లలో ఏ ఒక్కరు అప్పీల్ చేయలేదు. అప్పీల్ ఎందుకు చేయలేదని కీపర్ ర్యాన్ రికెల్టన్‌పై హార్దిక్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అనంతరం ఇషాన్ కిషన్‌ తలపై చేయి వేసి అభినందించాడు.

SRH vs MI IPL 2025 Ishan Kishan Dismissal Did Umpire Make A Mistake What Is The MCC Rule

ఇషాన్ అత్యుత్సాహం
జెంటిల్ మెన్ గేమ్‌లో ఇషాన్ క్రీడా స్ఫూర్తి చాటాడని అంతా అనుకున్నారు. కానీ రిప్లేలో బంతి బ్యాట్‌కు తాకనేలేదని స్పష్టమైంది. దాంతో అందరూ అవాక్కయ్యారు. ఇషాన్ కిషన్ అత్యుత్సాహంతో వెనుదిరిగాడనే విషయం అర్థమైంది. సన్‌రైజర్స్ అభిమానులు ఇషాన్ కిషన్‌పై మండిపడుతున్నారు. ఇషాన్ కిషన్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని, అతనిపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. మరికొందరు అంపైర్‌ను తప్పుబడుతున్నారు. అంపైర్‌కు స్పష్టత లేనప్పుడు టెక్నాలజీని ఉపయోగించుకోవాల్సిందని, నాటౌట్ అని తేలాక మళ్లీ బ్యాటింగ్‌కు పిలవాల్సిందని మండిపడుతున్నారు.

ఐసీసీ రూల్స్ ఏంటంటే..?
ఎంసీసీ రూల్ 31.7 ప్రకారం.. బ్యాటర్ ఔట్ కాలేదని, ఔటయ్యానని పొరబడి క్రీజును వీడాడని అంపైర్ భావిస్తే.. జోక్యం చేసుకొని మళ్లీ అతన్ని బ్యాటింగ్‌కు పిలవవచ్చు. అప్పుడు ఆ బంతిని డెడ్ బాల్‌గా ప్రకటించాల్సి ఉంటుంది. తదుపరి బంతి వేసేలోపు బ్యాటర్‌ను మళ్లీ బ్యాటింగ్‌కు తీసుకు రావచ్చు. అయితే అది ఇన్నింగ్స్ యొక్క చివరి వికెట్ అయితే మాత్రం అలా చేయలేరు.

అనుభవం లేకపోవడంతోనే..
ఇషాన్ కిషన్ బ్యాట్‌కు బంతి తగల్లేదని అంపైర్ వినోద్ భావించి ఉంటే అతన్ని మళ్లీ బ్యాటింగ్‌కు పిలిచేవాడు. కానీ అతను ఇషాన్ కిషన్ బాడీ లాంగ్వేజ్, యాక్షన్‌ను బట్టి ఔటిచ్చాడు. దాంతోనే మళ్లీ బ్యాటింగ్‌కు పిలవలేకపోయాడు. అంపైర్ వినోద్‌కు పెద్దగా అనుభవం లేకపోవడంతోనే అతను ఈ తప్పిదం చేసినట్లు తెలుస్తోంది. దేశవాళీ క్రికెట్‌లో అంపైర్‌గా బాధ్యతలు నిర్వహించిన వినోద్.. ఈ ఏడాదే ఐపీఎల్‌లో అంపైరింగ్ చేసే అవకాశాన్ని అందుకున్నాడు.

Story first published: Thursday, April 24, 2025, 13:12 [IST]
Other articles published on Apr 24, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+