Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH vs MI: అందుకే నటరాజన్‌ను పక్కనపెట్టాం: ప్యాట్ కమిన్స్

ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని ముంబై ఇండియన్స్ సారథి హార్దిక్ పాండ్యా తెలిపాడు.

'మేం ముందుగా బౌలింగ్ చేయాలనుకుంటున్నాం. చూడటానికి పిచ్ మంచి ట్రాక్‌లా కనిపిస్తోంది. గత మ్యాచ్‌లో మేం అద్భుతంగా రాణించినా.. మా ప్రణాళికలను సమర్ధవంతంగా అమలు చేయలేకపోయాం. దాంతో ఓటమిపాలయ్యాం. ఇంకా 13 మ్యాచ్‌లు ఉన్నాయి. మా తప్పిదాలను సరిదిద్దుకొని విజయాలు సాధిస్తాం.

SRH vs MI IPL 2024 Pat Cummins Reveals The Reason Why Natarajan Not Playing Against Mumbai Indians

సానుకూల ఆలోచనలతో ఈ టోర్నీలో ఎదురయ్యే సవాళ్లను స్వీకరిస్తాం. జట్టులోని ఆటగాళ్లందరితో ప్రత్యేకంగా గడిపాను. తుది జట్టులో ఒక మార్పు చేశాం. లూక్ స్థానంలో మఫాక జట్టులోకి వచ్చాడు.'అని హార్దిక్ పాండ్యా పేర్కొన్నాడు.

టాస్ ఓడినందుకు తమకు ఎలాంటి బాధ లేదని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తెలిపాడు. పిచ్ మంచి వికెట్‌లా కనిపిస్తోందన్నాడు. ఇది చాలా కఠినమైన టోర్నీ అని, సొంత అభిమానుల మద్దతు ఈ మ్యాచ్‌లో తమ విజయానికి కలిసొస్తుందని చెప్పాడు. జట్టులో రెండు మార్పులు చేశామని చెప్పిన కమిన్స్.. మార్కో జాన్సెన్ స్థానంలో ట్రావిస్ హెడ్ జట్టులోకి వచ్చాడని చెప్పాడు.

ఫిట్‌నెస్ సమస్యలతో నటరాజన్ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడని, అతని స్థానంలో జయదేవ్ ఉనాద్కత్ ఆడుతున్నాడని తెలిపాడు. తమది అద్భుతమైన జట్టని, ఈ రోజు ఆడే ఆటగాళ్లు విజయం కోసం తమ సాయశక్తులు ధారపోస్తారని చెప్పాడు. కేకేఆర్‌తో జరిగిన తమ తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ తృటిలో విజయాన్ని చేజార్చుకుంది. ఈ మ్యాచ్‌లో నటరాజ్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు.

తుది జట్లు:

సన్‌రైజర్స్ హైదరాబాద్: ట్రావిస్ హెడ్, మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ, ఎయిడెన్ మార్క్‌రమ్, హెన్రీచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్, షెహ్‌బాజ్ అహ్మద్, ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, జయదేవ్ ఉనాద్కత్

ముంబై ఇండియన్స్: ఇషాన్ కిషన్(కీపర్), రోహిత్ శర్మ, నమన్ ధీర్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, టీమ్ డేవిడ్, గెరాల్డ్ కోయిట్జీ, షామ్స్ ములానీ, పియూష్ చావ్లా, జస్‌ప్రీత్ బుమ్రా, క్వెనా మఫక

Story first published: Wednesday, March 27, 2024, 19:22 [IST]
Other articles published on Mar 27, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+