For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

SRH vs MI Dream11 Prediction: డ్రీమ్11 టీమ్.. కెప్టెన్, వైస్ కెప్టెన్ టిప్స్! పిచ్ రిపోర్ట్, తుది జట్లు ఇవే!!

SRH vs MI Dream11 Prediction: Fantasy Cricket Tips, Dream11 Team and Playing XI for match 55

అబుదాబి: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 లీగ్ దశ ఈరోజుతో ముగియనుంది. శుక్రవారం ఒకే సమయానికి రెండు మ్యాచులు ఆరంభం కానున్నాయి. ఐపీఎల్ చరిత్రలో ఒకేసారి రెండు మ్యాచ్‌లు జరగడం ఇదే మొదటిసారి. అబుదాబి వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య ఒక మ్యాచ్ జరగనుండగా.. దుబాయ్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. ఈ రెండు మ్యాచులు రాత్రి 7.30కు ప్రారంభం కానున్నాయి.

దీంతో అభిమానులు ఏ మ్యాచ్ చూడాలనే తికమకలో ఉన్నారు. సన్‌రైజర్స్ ఇప్పటికే ప్లే ఆఫ్ రేసులో లేదు కాబట్టి విజయంతో టోర్నీని ముగించాలని చూస్తోంది. అయితే ఈరోజు ముంబైకి విజయం చాలా కీలకంగా మారింది. కోల్‌కతా విజయం తర్వాత ఇప్పుడు ఒక అద్భుతం జరిగితే మాత్రమే రోహిత్ సేన ప్లే ఆఫ్‌కి చేరుతుంది. అందుకే భారీ విజయమే లక్ష్యంగా ముంబై బరిలోకి దిగుతోంది.

 హెడ్ టు హెడ్ రికార్డ్స్

హెడ్ టు హెడ్ రికార్డ్స్

అబుదాబిలోని షేక్ జాయెద్ అంతర్జాతీయ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుండగా.. టాస్ రాత్రి 7 గంటలకు పడనుంది. ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఇక ఓటీటీలో కూడా ఈ మ్యాచ్‌ను చూడాలనుకునే ఫాన్స్ హాట్‌స్టార్‌లో వీక్షించవచ్చు.

ఐపీఎల్ టోర్నీలో భాగంగా హైదరాబాద్, ముంబై జట్లు 27 సార్లు తలపడ్డాయి. ఇందులో హైదరాబాద్ 8 సార్లు గెలుపొందగా.. ముంబై 9 విజయాలు అందుకుంది. ఐపీఎల్ 2021లో హైదరాబాద్, ముంబై తలపడిన మ్యాచులో రోహిత్ సేన విజయం సాదించింది. ఇరు జట్ల మధ్య చివరి ఐదు మ్యాచుల్లో ఒకటి హైదరాబాద్​, నాలుగు ముంబై గెలిచింది.

అబుదాబి మైదానంలో ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా జరగలేదు. ఈరోజు ఆడేదే తొలి మ్యాచ్. షేక్ జాయెద్ స్టేడియం పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలమైనది. ఇన్నింగ్స్ మధ్యలో స్పిన్నర్లు, చివరలో పేసర్లకు పిచ్ అనుకూలంగా ఉండనుంది. మ్యాచుకు ఎలాంటి వర్షపు ముప్పులేదు. ఇక్కడ ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్ ఉండనుంది.

వార్నర్‌ ఆడేనా

వార్నర్‌ ఆడేనా

మాజీ కెప్టెన్, డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ మేనేజ్‌మెంట్ పక్కన పెట్టడంపై ఇప్పటికే విమర్శల వర్షం కురిసిన విషయం తెలిసిందే. వార్నర్ ఫామ్‌ను కోల్పోయాడనే కారణంతో అతడిని తుది జట్టులోకి తీసుకోవట్లేదు. దాంతో టీ20 స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ జేసన్ రాయ్, వృద్ధిమాన్ సాహా జట్టు ఇన్నింగ్‌ను ఆరంభిస్తున్నారు. అయితే ఈరోజు వార్నర్ బరిలోకి దిగే అవకాశం ఉంది. ఎందుకంటే.. ఈ మ్యాచ్ తరువాత వార్నర్ ఇక హైదరాబాద్‌ జట్టులో కనిపించకపోవచ్చు. తాను ఈ జట్టులో కొనసాగే అవకాశాలు దాదాపుగా లేవంటూ కొద్దిరోజుల కిందటే అతడు ఓ ట్వీట్ చేశాడు. వార్నర్‌కు ఘనంగా వీడ్కోలు పలకడానికి అతన్ని తుది జట్టులోకి తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

ఆ ముగ్గురిలో ఒకరిపై వేటు

ఆ ముగ్గురిలో ఒకరిపై వేటు

డేవిడ్ వార్నర్ తుది జట్టులోకి వస్తే.. వృద్ధిమాన్ సాహా మిడిల్ ఆర్డర్లో బరిలోకి దిగే అవకాశాలు ఉంటాయి. అభిషేక్ శర్మ మెరుపులు ఒక ఇన్నింగ్స్‌కే పరిమితం అయ్యాయి. అబ్దుల్ సమద్, ప్రియం గార్గ్ సత్తాచాటాల్సిన అవసరం ఉంది. వార్నర్ రాక నిజమైతే.. ఈ ముగ్గురిలో ఒకరిపై వేటు పడనుంది. జాసన్ హోల్డర్ మరోసారి మెరిస్తే హైదరాబాద్ గెలుపు అవకాశాలు మెరుగవుతాయి. భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్ ఆకట్టుకుంటున్నారు.

సిద్ధార్థ్ కౌల్ కూడా రాణిస్తే బౌలింగ్ పటిష్టమవుతుంది. హార్డ్ హిట్టర్ షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఇక మహ్మద్ నబీ, బాసిల్ థంపి, విరాట్ సింగ్, శ్రీవత్ గోస్వామి కూడా ఐపీఎల్ 2021 రెండో దశలో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.

RCB vs SRH: కోహ్లీ తరహాలో చహల్ ఫన్నీ రియాక్షన్.. మైదానంలో నవ్వులేనవ్వులు!! (వీడియో)

అద్భుతం జరిగేనా

అద్భుతం జరిగేనా

ఈ మ్యాచు కోసం ముంబై ఇండియన్స్ జట్టులో మార్పులు ఏవీ ఉండకపోవచ్చు. ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి దాదాపు వైదొలగినందున.. చిట్టచివరి మ్యాచ్‌లో గెలిచి ఈ సీజన్‌ను విజయవంతంగా ముగించాలని భావిస్తోంది. అయితే ఏదైనా అద్భుతం జరిగే మాత్రం ముంబైకి అవకాశాలు ఉంటాయి. భారీ విజయం సాధిస్తే గాని కోల్‌కతాను దాటి ముంబై ప్లే ఆఫ్స్ చేరదు.

ఇప్పుడు ఉన్న ఆటగాళ్లతోనే లీగ్ దశను ముగించడానికే జట్టు మేనేజ్‌మెంట్ మొగ్గు చూపొచ్చు. అయిదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ ఈ దఫా కూడా టైటిల్‌ను గెలవాలనే వ్యూహంతో సీజన్ ఆరంభించినా.. అంచనాలకు తలకిందులు చేసింది. లీగ్ దశలోనే నిష్క్రమించనుంది. బ్యాటింగ్ విభాగమే ముంబై వైఫల్యానికి కారణం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

 తుది జట్లు (అంచనా)

తుది జట్లు (అంచనా)

సన్‌రైజర్స్‌ హైదరాబాద్: జాసన్ రాయ్, డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ప్రియం గార్గ్/వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్, జేసన్ హోల్డర్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, సిద్దార్థ్ కౌల్/సందీప్ శర్మ.

ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, సౌరభ్ తివారి, కీరన్ పొల్లార్డ్, జిమ్మీ నీషమ్, జయంత్ యాదవ్, నాథన్ కౌల్టర్-నైల్, జస్‌ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్.

డ్రీమ్ 11 టీమ్

డ్రీమ్ 11 టీమ్

ఇషాన్ కిషన్ (కీపర్), రోహిత్ శర్మ (కెప్టెన్), జాసన్ రాయ్, కేన్ విలియమ్సన్, సూర్యకుమార్ యాదవ్, జాసన్ హోల్డర్ (వైస్ కెప్టెన్), జిమ్మీ నీషమ్, జస్‌ప్రీత్ బుమ్రా, రషీద్ ఖాన్, నాథన్ కౌల్టర్-నైల్, భువనేశ్వర్ కుమార్.

Story first published: Friday, October 8, 2021, 16:55 [IST]
Other articles published on Oct 8, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+