Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH vs MI: దుమ్మురేపిన తెలుగోడు.. అదరగొట్టిన గ్రీన్!

హైదరాబాద్: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బ్యాటర్లు అదరగొట్టారు. కామెరూన్ గ్రీన్(40 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 64 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించగా.. లోకల్ బాయ్ తిలక్ వర్మ(17 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 37) మెరుపులు మెరిపించాడు.

దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 192 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో మార్కో జాన్సెన్ రెండు వికెట్లు తీయగా.. నటరాజన్, భువనేశ్వర్ కుమార్ తలో వికెట్ పడగొట్టారు.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్.. ఇన్నింగ్స్‌ను ఓపెనర్లు రోహిత్ శర్మ(18 బంతుల్లో 6 ఫోర్లతో 28), ఇషాన్ కిషన్(31 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38) ధాటిగా ప్రారంభించారు. వరుస బౌండరీలతో సన్‌రైజర్స్ బౌలర్లపై విరుచుకుపడ్డారు.

ప్రమాదకరంగా మారిన ఈ జోడీని నటరాజన్ విడదీసాడు. స్లోయర్ కట్టర్‌తో క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి వచ్చిన కామెరూన్ గ్రీన్‌తో కలిసి ఇషాన్ కిషన్ దూకుడుగా ఆడాడు.

Cameron Green, Tilak Varma

దాంతో ముంబై పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 53 పరుగులు చేసింది. ఇషాన్ ధాటిగా ఆడినా గ్రీన్ టైమ్ తీసుకున్నాడు. మార్కో జాన్సెన్ ఒకే ఓవర్‌లో ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(7)ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఈ రెండు క్యాచ్‌లను మార్క్‌రమ్ అందుకోవడం విశేషం.

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన లోకల్ ప్లేయర్ తిలక్ వర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. భారీ సిక్సర్లతో స్కోర్ బోర్డును పరుగెత్తించాడు. ఇన్నింగ్స్ 17వ ఓవర్‌లో తిలక్ వర్మను భువీ ఔట్ చేయగా.. గ్రీన్ 33 బంతుల్లో తొలి ఐపీఎల్ హాఫ్ సెంచరీ సాధించాడు.

19వ ఓవర్‌ను భువీ కట్టుదిట్టంగా వేసి 6 పరుగులే ఇచ్చాడు. ఇక నటరాజన్ వేసిన చివరి ఓవర్‌లో టీమ్ డేవిడ్(16) రెండు బౌండరీలతో 14 పరుగులు పిండుకోవడంతో ముంబై 190 పరుగుల మార్క్ అందుకుంది. చివరి బంతికి డబుల్ తీసే ప్రయత్నంలో టీమ్ డేవిడ్ రనౌటయ్యాడు.

Story first published: Tuesday, April 18, 2023, 21:23 [IST]
Other articles published on Apr 18, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+