ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ చరిత్రలో నిలిచిపోనుంది. సిక్సర్ల వర్షం కురిసిన ఈ మ్యాచ్‌లో రికార్డుల మోత మోగింది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు కలిపి 523 పరుగులు చేశాయి. టీ20 చరిత్రలోనే ఒక మ్యాచ్‌లో ఇన్ని పరుగులు నమోదవ్వడం ఇదే తొలిసారి.
అంతేకాకుండా ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు కలిపి 38 సిక్స్‌లు నమోదు చేశాయి. పురుషుల టీ20 క్రికెట్‌లో ఇది ఆల్‌టైమ్ రికార్డు. ఐపీఎల్ చరిత్రలోనూ అత్యధిక సిక్స్‌లు నమోదైన మ్యాచ్‌గా కూడా ఇది చరిత్రకెక్కింది. ఈ 38 సిక్స్‌లలో ముంబై ఇండియన్స్ 20 సిక్సర్లు నమోదు చేయగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ 18 సిక్స్‌లు కొట్టింది.

ఈ మ్యాచ్‌లో నమోదైన రికార్డ్స్..
1. ఐపీఎల్ చరిత్రలోనే నమోదైన అత్యధిక స్కోర్లు
277/3 - సన్‌రైజర్స్ vs ముంబై, హైదరాబాద్, 2024
263/5 - ఆర్‌సీబీ vs పుణేవారియర్స్, బెంగళూరు, 2013
257/5 - లక్నో vs పంజాబ్, మొహాలి, 2023
248/3 - ఆర్‌సీబీ vs గుజరాత్ లయన్స్, బెంగళూరు, 2016
246/5 - చెన్నై vs రాజస్థాన్ రాయల్స్, చెన్నై, 2010
246/5 - ముంబై ఇండియన్స్ vs సన్‌రైజర్స్, హైదరాబాద్, 2024
2. ఐపీఎల్ మ్యాచ్‌లో నమోదైన అత్యధిక సిక్స్‌లు
38- సన్‌రైజర్స్ vs ముంబై, హైదరాబాద్, 2024
33 - ఆర్‌సీబీ vs సీఎస్‌కే, బెంగళూరు, 2018
33 - రాజస్థాన్ vs సీఎస్‌కే, షార్జా, 2020
33 - ఆర్‌సీబీ vs సీఎస్‌కే, బెంగళూరు, 2023
3. ఐపీఎల్‌లో ఒక జట్టు నమోదు చేసిన అత్యధిక సిక్సర్లు
21 - ఆర్‌సీబీ vs పీడబ్ల్యూఐ, బెంగళూరు, 2013
20 - ఆర్‌సీబీ vs గుజరాత్ లయన్స్, బెంగళూరు, 2016
20 - ఢిల్లీ vs గుజరాత్ లయన్స్, ఢిల్లీ, 2017
20 - ముంబై vs సన్‌రైజర్స్, హైదరాబాద్, 2024
18 - ఆర్‌సీబీ vs పంజాబ్, బెంగళూరు, 2015
18 - రాజస్థాన్ vs పంజాబ్, షార్జా, 2020
18 - సీఎస్‌కే vs కేకేఆర్, కోల్‌కతా, 2023
18 - సన్‌రైజర్స్ vs ముంబై, హైదరాబాద్, 2024
ఈ హైస్కోరింగ్ థ్రిల్లర్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 31 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 277 పరుగుల భారీ స్కోర్ చేసింది.
అనంతరం లక్ష్య చేధనకు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 246 పరుగులు చేసి ఓటమిపాలైంది.