Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH vs MI: మార్క్‌రమ్ మామ క్యాచ్.. పోలా అదిరిపోలా! (వీడియో)

హైదరాబాద్: సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్ కళ్లు చెదిరే క్యాచ్‌తో ఔరా అనిపించాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో సూపర్ ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. మార్క్‌రమ్ సెన్సేషనల్ క్యాచ్‌కు ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్, డేంజరస్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్(7)నిరాశగా పెవిలియన్ చేరాడు.

ఈ క్యాచ్‌ను మార్క్‌రమ్ అచ్చం చేప పిల్లలానే సూపర్ డైవ్‌తో అందుకున్నాడు. ఈ స్టన్నింగ్ క్యాచ్‌‌కు సూర్యతో పాటు మైదానంలో ఉన్న ఆటగాళ్లు, అభిమానులు, కామెంటేటర్లు, టీవీ ప్రేక్షకులు బిత్తరపోయారు. ప్రస్తుతం ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా కాగా.. 'మార్క్‌రమ్ మామ క్యాచ్.. పోలా అదిరిపోలా!'అని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

Aiden Markram

ఐపీఎల్ 2023 సీజన్ బెస్ట్ క్యాచ్‌ల్లో ఇది నిలుస్తుందని కామెంట్ చేస్తున్నారు. మార్కో జాన్సెన్ వేసిన 12వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ తొలి బంతికి ఇషాన్ కిషన్.. మార్క్‌రమ్ క్యాచ్‌కే వెనుదిరగ్గా.. క్రీజులోకి వచ్చిన సూర్య భారీ సిక్సర్‌తో జోరు కనబర్చాడు. కానీ ఇదే ఓవర్ ఐదో బంతిని జాన్సెన్ చేంజ్ ఆఫ్ పేస్‌తో స్లోయర్ కట్టర్ వేయగా సూర్య కవర్ డ్రైవ్ ఆడే ప్రయత్నం చేశాడు.

కానీ మిడాఫ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్ ఎడమవైపు సూపర్ డైవ్‌తో బంతిని అందుకున్నాడు. దాంతో సూర్య నిరాశగా పెవిలియన్ చేరాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 192 పరుగులు చేసింది. కామెరూన్ గ్రీన్(40 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 64 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించగా.. లోకల్ బాయ్ తిలక్ వర్మ(17 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 37), ఓపెనర్లు రోహిత్ శర్మ(18 బంతుల్లో 6 ఫోర్లతో 28), ఇషాన్ కిషన్(31 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38) మెరుపులు మెరిపించారు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో మార్కో జాన్సెన్ రెండు వికెట్లు తీయగా.. నటరాజన్, భువనేశ్వర్ కుమార్ తలో వికెట్ పడగొట్టారు.

Story first published: Tuesday, April 18, 2023, 22:08 [IST]
Other articles published on Apr 18, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+