For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

SRH vs LSG: ట్రావిస్ హెడ్ విధ్వంసం.. సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన విజయం!

ఐపీఎల్ 2024 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన విజయాన్నందుకుంది. లక్నో సూపర్ జెయింట్స్‌తో బుధవారం ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు అభిషేక్ శర్మ(28 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లతో 75 నాటౌట్), ట్రావిస్ హెడ్(30 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్స్‌లతో 89 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్‌తో సునాయస విజయాన్ని అందుకుంది.

SRH vs LSG Sunrisers decimate Super Giants by 10 wickets in IPL 2024

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 165 పరుగులు చేసింది. ఆయుష్ బదోని(30 బంతుల్లో 9 ఫోర్లతో 55), నికోలస్ పూరన్(26 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 48) విధ్వంసకర బ్యాటింగ్‌తో రాణించారు.

కేఎల్ రాహుల్(33 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 29), కృనాల్ పాండ్యా(21 బంతుల్లో 2 సిక్స్‌లతో 24) పరిస్థితులకు తగ్గట్లు కీలక ఇన్నింగ్స్ ఆడారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్(2/12) రెండు వికెట్లు తీయగా.. ప్యాట్ కమిన్స్ ఓ వికెట్ పడగొట్టాడు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ల సంచలన బ్యాటింగ్‌తో 9.4 ఓవర్లలోనే 167 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. లక్నో బ్యాటర్లు తడబడిన పిచ్‌పై సన్‌రైజర్స్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు.

ఆకాశమే హద్దుగా..
పిచ్ నెమ్మదిగా ఉండటంతో సన్‌రైజర్స్ గెలుపు కష్టమని, హోరాహోరీ మ్యాచ్ తప్పదని అంతా అనుకున్నారు. కానీ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ తొలి బంతి నుంచే ధాటిగా ఆడారు. పోటాపడి బౌండరీలు బాదారు. ముఖ్యంగా ట్రావిస్ హెడ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. నవీన్ ఉల్ హక్ వేసిన ఐదో ఓవర్‌లో 4, 4, 6, 4, 4 బాది 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

అభిషేక్ శర్మ కూడా బ్యాట్‌కు పని చెప్పడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ పవర్ ప్లేలోనే 107 పరుగులు చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే పవర్ ప్లేలో రెండు సార్లు 100 పరుగులు చేసిన తొలి జట్టుగా సన్‌రైజర్స్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. 19 బంతుల్లోనే అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం అదే జోరు కనబర్చిన ఈ జోడీ.. 9.4 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించి లక్నోకు ఘోర పరాభావాన్ని మిగిల్చారు.

Story first published: Wednesday, May 8, 2024, 22:29 [IST]
Other articles published on May 8, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+