Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH vs LSG: సన్వీర్ సింగ్ కళ్లు చెదిరే క్యాచ్.. బిత్తరపోయిన మార్కస్ స్టోయినీస్!

సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ ప్లేయర్ సన్వీర్ సింగ్ కళ్లు చెదిరే క్యాచ్‌తో ఔరా అనిపించాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్వీర్ సింగ్ సూపర్ ఫీల్డింగ్‌తో ఆకట్టున్నాడు. అచ్చం చేప పిల్లలా డైవ్ చేసి బంతిని అందుకున్నాడు. సన్వీర్ సింగ్ స్టన్నింగ్ క్యాచ్‌కు లక్నో సూపర్ జెయింట్స్ స్టార్ బ్యాటర్ మార్కస్ స్టోయినీస్(3) బిత్తరపోయాడు.

క్లియర్ క్యాచ్‌నా? కాదా? అని అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. భువనేశ్వర్ కుమార్ వేసిన ఐదో ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ రెండో బంతిని భువనేశ్వర్ కుమార్ బ్యాక్ ఆఫ్ లెంగ్త్‌లో వేయగా.. స్టోయినీస్ పుల్ షాట్ ఆడాడు. అయితే బంతిని అంచనా వేయడంలో విఫలమైన స్టోయినీస్ ఆలస్యంగా షాట్ ఆడటంతో బంతి మిడాన్ దిశలో గాల్లోకి లేచింది.

SRH vs LSG Sanvir Singh takes brilliant diving catch to send back Marcus Stoinis in IPL 2024

అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న సన్వీర్ సింగ్ సూపర్ డైవ్‌తో బంతిని అందుకున్నాడు. అయితే బంతినే అందుకునే క్రమంలో నేలకు తాకించాడా? అనే సందేహంతో ఫీల్డ్ అంపైర్ సమీక్ష కోరగా.. రీప్లేలను పరిశీలించిన టీవీ అంపైర్ క్లియర్ క్యాచ్ అంటూ ఔటిచ్చాడు.

సన్వీర్ సింగ్ స్టన్నింగ్ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ క్యాచ్‌కు ఫిదా అయిన నెటిజన్లు సన్వీర్ సింగ్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ సీజన్ బెస్ట్ క్యాచ్ అని ఒకరంటే.. ఆల్‌టైమ్ సూపర్ డైవ్ క్యాచ్ అని కొనియాడుతున్నారు.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ 57 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. పిచ్ నెమ్మదిగా ఉండటంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. భువనేశ్వర్ కుమార్ వేసిన మూడో ఓవర్‌లోనే క్వింటన్ డికాక్ ఔటవ్వగా.. అతని మరుసటి ఓవర్‌లో స్టోయినీస్ వెనుదిరగాడు. ఆచితూచి ఆడుతున్న రాహుల్(29)ను కమిన్స్ పెవిలియన్ చేర్చాడు.

Story first published: Wednesday, May 8, 2024, 20:38 [IST]
Other articles published on May 8, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+