ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ తెలిపాడు.
'మేం ముందుగా బ్యాటింగ్ చేయాలనుకుంటున్నాం. గతంలో ఇక్కడ ఆడిన మ్యాచ్‌ల అనుభవంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇరు జట్లకు ఈ మ్యాచ్ ఎంతో కీలకం. ఈ మ్యాచ్‌లో మేం ఫోకస్ పెట్టాల్సిన అంశం ఒకటి ఉంది. ముందుగా బ్యాటింగ్ చేసి భారీ లక్ష్యాన్ని నమోదు చేయడమే. సొంతగడ్డపై ఆడుతుండటం ఎప్పుడూ విభిన్నంగానే ఉంటుంది.

అయితే మేం ఇప్పటికే చాలా క్రికెట్ ఆడాం. ఇక్కడి పరిస్థితులు ఏంటో మాకు బాగా తెలుసు. తుది జట్టులో కొన్ని మార్పులు చేశాం. క్వింటన్ డికాక్ జట్టులోకి రాగా.. మోహ్‌సిన్ ఖాన్ దూరమయ్యాడు. మరికొన్ని మార్పులు కూడా జరిగాయి.'అని కేఎల్ రాహుల్ చెప్పుకొచ్చాడు.
టాస్ గెలిస్తే తాము ముందుగా బ్యాటింగ్ చేయాలనుకున్నామని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్, బర్త్ డే భాయ్ ప్యాట్ కమిన్స్ తెలిపాడు. నేడు కమిన్స్ 31వ జన్మదినం జరుపుకుంటున్నాడు. 'బర్త్ డే విషెస్ చెప్పినందుకు ధన్యవాదాలు. టాస్ గెలిస్తే బ్యాటింగ్ చేయాలనుకున్నాం. ఇక్కడి నుంచి మేం బ్యాటింగ్, బౌలింగ్ చేసినా విజయాలు నమోదు చేయాలి.
ఈ వికెట్‌పై మంచి లక్ష్యం ఏంటో చెప్పడం కష్టం. ఇది కూడా హైస్కోరింగ్ గేమ్ కావచ్చు. ప్లే ఆఫ్స్ చేరాలంటే ప్రతీ మ్యాచ్ గెలవాలి. గత మ్యాచ్‌ల్లో మేం విజయాలను అందుకోలేకపోయాం. జట్టులో కొన్ని మార్పులు చేశాం. మయాంక్ అగర్వాల్ స్థానంలో సన్వీర్ రాగా.. మార్కో జాన్సెన్ స్థానంలో వియాస్కంత్ అరంగేట్రం చేస్తున్నాడు.'అని ప్యాట్ కమిన్స్ చెప్పుకొచ్చాడు.
స్పిన్ బలాన్ని పెంచుకునేందుకే విజయకాంత్ వియస్కాంత్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆడిస్తున్నట్లు తెలుస్తోంది. గాయంతో జట్టుకు దూరమైన వానిందు హసరంగా స్థానంలో ఈ శ్రీలంక స్పిన్నర్‌ను తీసుకున్న విషయం తెలిసిందే.
తుది జట్లు:
లక్నో సూపర్ జెయింట్స్: క్వింటన్ డికాక్, కేఎల్ రాహుల్, మార్కస్ స్టోయినీస్, నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, కృష్ణప్ప గౌతమ్, యశ్ ఠాకూర్, రవి బిష్ణోయ్, నవీన్ ఉల్ హక్.
సన్‌రైజర్స్ హైదరాబాద్: ట్రావిస్ హెడ్, నితీష్ రెడ్డి, హెన్రీచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్, షెహ్‌బాజ్ అహ్మద్, సన్వీర్ సింగ్, ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనాద్కత్, విజయకాంత్ వియస్కాంత్, టీ నటరాజన్.