Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH vs LSG: ఒకే ఓవర్‌లో 5 సిక్స్‌లు.. నికోలస్ పూరన్ విధ్వంసం!

హైదరాబాద్: లక్నో సూపర్ జెయింట్స్ బిగ్ హిట్టర్ నికోలస్ పూరన్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో పూరన్ ఒంటి చేత్తో మ్యాచ్ ఫలితాన్ని శాసించాడు. ఎదుర్కొన్న తొలి మూడు బంతులనే భారీ సిక్సర్లుగా మలిచి తన పాత ఫ్రాంచైజీ సన్‌రైజర్స్‌పై రివేంజ్ తీర్చుకున్నాడు.

గత సీజన్ వరకు సన్‌రైజర్స్ ప్రాతినిథ్యం వహించిన పూరన్.. దారుణంగా విఫలమయ్యాడు. దాంతో పూరన్‌ను సన్‌రైజర్స్ వదిలించుకోగా.. లక్నో భారీ ధరకు కొనుగోలు చేసింది. మినీ వేలంలో ఫ్రాంచైజీలన్నీ చీకొట్టిన వేళ లక్నో మెంటార్ గౌతమ్ గంభీర్ పోటీపడి మరీ పూరన్‌ను తీసుకున్నాడు. ఆ సమయంలో గంభీర్‌ను చూసి అంతా నవ్వుకున్నారు.

Nicholas Pooran 5 Sixes

కానీ పూరన్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. 13 బంతుల్లోనే 4 భారీ సిక్సర్లతో పాటు మూడు బౌండరీలతో 44 పరుగులతో అజేయంగా నిలిచి తాను ఎంతటి ప్రమాదకర ఆటగాడిననే విషయాన్ని చాటి చెప్పాడు. ముఖ్యంగా అభిషేక్ శర్మ వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్‌లో చివరి మూడు బంతులను సిక్స్‌లుగా మలిచి మ్యాచ్ గమనాన్ని మార్చేశాడు.

ఈ ఓవర్ తొలి మూడు బంతుల్లో మార్కస్ స్టోయినీస్ రెండు సిక్స్‌లు బాది ఔటవ్వడంతో.. మొత్తం 5 సిక్స్‌లు నమోదయ్యాయి. ఒక వైడ్ కూడా వేయడంతో 31 పరుగులు వచ్చాయి. ఈ ఓవర్ ముందు వరకు హైదరాబాద్ చేతిలో ఉన్న మ్యాచ్ ఒక్కసారిగా లక్నోవైపు మళ్లింది. చివరి నాలుగు ఓవర్లలోనే లక్నో 70 పరుగులు బాది చిరస్మరణీయ విజయాన్నందుకుంది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 182 పరుగులు చేసింది. హెన్రీచ్ క్లాసెన్(29 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 47), అబ్దుల్ సమద్(25 బంతుల్లో ఫోర్, 4 సిక్స్‌లతో 37 నాటౌట్) రాణించారు. లక్నో బౌలర్లలో కృనాల్ పాండ్యా రెండు వికెట్లు తీయగా.. యుధ్‌వీర్ సింగ్, ఆవేశ్ ఖాన్, యశ్ థాకూర్, అమిత్ మిశ్రా తలో వికెట్ తీసారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ 19.2 ఓవర్లలోనే 3 వికెట్లకు 185 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. యువ ప్లేయర్ ప్రేరక్ మన్కడ్(45 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 64 నాటౌట్) హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. మార్కస్ స్టోయినీస్(25 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 40), నికోలస్ పూరన్(13 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 44 నాటౌట్) మెరుపులు మెరిపించారు. సన్‌రైజర్స్ బౌలర్లలో ఫిలిప్స్, మయాంక్ మార్కండే, అభిషేక్ శర్మ తలో వికెట్ తీసారు.

Story first published: Saturday, May 13, 2023, 19:46 [IST]
Other articles published on May 13, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+