హైదరాబాద్: సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ బ్యాటర్ గ్లేన్ ఫిలిప్స్‌పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో ఉప్పల్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో గ్లేన్ ఫిలిప్స్(0) గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. దాంతో అభిమానులు అతనిపై మండిపడుతున్నారు. జట్టుకు అద్భుతమైన ఆరంభం దక్కిన తర్వాత కూడా ఇలా పేలవ బ్యాటింగ్‌తో విఫలమవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
కృనాల్ పాండ్యా వేసిన 13వ ఓవర్ తొలి బంతికి కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్(28) స్టంపౌటవ్వగా.. మరుసటి బంతికే ఫిలిప్స్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. హ్యారీబ్రూక్ దారుణంగా విఫలమవడంతో అతనిపై వేటు వేసి ఫిలిప్స్ అవకాశం ఇవ్వగా.. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో సత్తా చాటాడు. 7 బంతుల్లో 25 పరుగులు చేసి సన్‌రైజర్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

దాంతో ఫిలిప్స్‌పై సన్‌రైజర్స్ అభిమానులు ప్రశంసల జల్లు కురిపించారు. ఫలక్‌నుమా ఫిలిప్స్ అంటూ ఆకాశానికెత్తారు. ఈ పెర్ఫామెన్స్‌తోనే జట్టులో కొనసాగిన అతను తాజా మ్యాచ్‌లో గోల్డెన్ డకౌటవ్వడంతో మెచ్చుకున్న అభిమానులే తిట్టని తిట్లు తిడుతున్నారు. ఫలక్‌నుమా ఫిలిప్స్ ఒక్క మ్యాచ్‌కే గుడ్డుపెట్టాడని ఫన్సీ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. బ్రూక్, ఫిలిప్స్ అంతా సన్‌రైజర్స్‌కు శనిలా దాపురించారని మండిపడుతున్నారు.
హెన్రీచ్ క్లాసెన్(29 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 47), అబ్దుల్ సమద్(25 బంతుల్లో ఫోర్, 4 సిక్స్‌లతో 37 నాటౌట్) చెలరేగడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 182 పరుగులు చేసింది.
అభిషేక్ శర్మ(7), గ్లేన్ ఫిలిప్స్(0) విఫలమైనా.. అన్‌మోల్ ప్రీత్ సింగ్(27 బంతుల్లో 7 ఫోర్లతో 36), రాహుల్ త్రిపాఠి(13 బంతుల్లో 4 ఫోర్లతో 20), ఎయిడెన్ మార్క్‌రమ్(20 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 28) పర్వాలేదనిపించారు.
లక్నో బౌలర్లలో కృనాల్ పాండ్యా రెండు వికెట్లు తీయగా.. యుధ్‌వీర్ సింగ్, ఆవేశ్ ఖాన్, యశ్ థాకూర్, అమిత్ మిశ్రా తలో వికెట్ తీసారు.