For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

SRH vs LSG: అతని వల్లే ఈ దూకుడు.. ఆ ముగ్గురికి స్పెషల్ థ్యాంక్స్: అభిషేక్ శర్మ

తన సహచర ఓపెనర్ ట్రావిస్ హెడ్ కారణంగానే తాను దూకుడుగా ఆడుతున్నానని సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ ప్లేయర్ అభిషేక్ శర్మ అన్నాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో అతను తనపై ఒత్తిడి లేకుండా స్వేచ్చగా ఆడేలా చేస్తున్నాడని తెలిపాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.

లక్నో సూపర్ జెయింట్స్‌తో ఉప్పల్ వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ శర్మ(28 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లతో 75 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. ట్రావిస్ హెడ్(30 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్స్‌లతో 89 నాటౌట్) కూడా విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ 10 వికెట్ల తేడాతో గెలుపొందింది.

SRH vs LSG Abhishek Sharma says all credit goes to Travis Head he starts the innings so well

166 పరుగులు లక్ష్యాన్ని ఈ ఇద్దరి విధ్వంసంతో 9.4 ఓవర్లలోనే ఛేదించి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ విజయానంతరం అధికారిక బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడిన అభిషేక్ శర్మ.. ట్రావిస్ హెడ్ కారణాంగానే దూకుడుగా ఆడుతున్నానని చెప్పాడు. అంతేకాకుండా తనను ఇలా ఆడేలా ప్రోత్సహించిన తన తండ్రితో పాటు బ్యాటింగ్ మెళకువలు నేర్పిన యువరాజ్ సింగ్, బ్రియాన్ లారాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశాడు.

'నా జీవితంలో ఇలాంటి టోర్నీ ఉంటుందని, ఇంత దూకుడుగా ఆడుతానని అస్సలు ఊహించలేదు. నేను ఇలా ఆడేలా ప్రోత్సహించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ మేనేజ్‌మెంట్‌కు ధన్యవాదాలు. స్వేచ్చగా దూకుడుగా ఆడాలని చెప్పారు. నా బ్యాటింగ్ క్రెడిట్ మొత్తం ట్రావిస్ హెడ్‌దే. అతను బౌలర్లపై విరుచుకుపడుతూ నాపై ఎలాంటి ఒత్తిడి లేకుండా చేస్తున్నాడు.

దాంతో నేను స్వేచ్చగా ఆడగలుగుతున్నాను. తొలి ఇన్నింగ్స్ అనంతరం పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం అవుతుందని మా బౌలర్లు చెప్పారు. అలానే పిచ్ మారింది. కానీ మేం ఊహించిన రీతిలో ఏం వికెట్ లేదు. ఈ టోర్నీకి ముందు నేను పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కుతోంది. నాకు బ్యాటింగ్‌ మెళకువలు నేర్పించిన యువరాజ్‌ సింగ్, బ్రియాన్ లారాతో పాటు నా తొలి కోచ్ అయిన మా నాన్నకు స్పెషల్ థ్యాంక్స్'అని అభిషేక్ శర్మ చెప్పుకొచ్చాడు.

SRH vs LSG Abhishek Sharma says all credit goes to Travis Head he starts the innings so well

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 165 పరుగులు చేసింది. ఆయుష్ బదోని(30 బంతుల్లో 9 ఫోర్లతో 55), నికోలస్ పూరన్(26 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 48) దూకుడుగా ఆడారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్(2/12) రెండు వికెట్లు తీయగా.. ప్యాట్ కమిన్స్ ఓ వికెట్ పడగొట్టాడు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 9.4 ఓవర్లలోనే 167 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది.

Story first published: Thursday, May 9, 2024, 9:03 [IST]
Other articles published on May 9, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+