Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH vs KKR: చెలరేగిన రింకూ సింగ్, నితీశ్ రాణా.. సన్‌రైజర్స్ ముందు టఫ్ టార్గెట్!

హైదరాబాద్: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్యాటర్లు సత్తా చాటారు. కెప్టెన్ నితీశ్ రాణా(31 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 42), రింకూ సింగ్(35 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 46) ధాటిగా ఆడటంతో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 171 పరుగులు చేసింది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో నటరాజన్, మార్కో జాన్సెన్ రెండేసి వికెట్లు తీయగా.. భువనేశ్వర్ కుమార్, కార్తీక్ త్యాగీ, ఎయిడెన్ మార్క్‌రమ్, మయాంక్ మార్కండే తలో వికెట్ తీసారు.

SRH vs KKR: SunRisers Hyderabad Restrict Kolkata Knight Riders to 171/9

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్‌కు శుభారంభం దక్కలేదు. మార్కో జాన్సెన్ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లోనే ఓపెనర్ రెహ్మానుల్లా గుర్బాజ్(0) గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. అదే ఓవర్‌లో వెంకటేశ్ అయ్యర్(7) కీపర్ క్యాచ్‌‌గా ఔటవ్వగా.. కార్తీక్ త్యాగీ జాసన్ రాయ్‌ను ఔట్ చేశాడు. దాంతో కేకేఆర్ పవర్ ప్లేలోనే 3 వికెట్లు కోల్పో 49 పరుగులు మాత్రమే చేసింది.

ఈ పరిస్థితుల్లో నితీశ్ రాణా, ఆండ్రీ రస్సెల్(24) జట్టును ఆదుకున్నారు. 61 పరుగుల భాగస్వామ్యం అనంతరం నితీశ్ రాణా(42)ను మార్క్‌రమ్ రిటర్న్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చగా.. క్రీజులోకి వచ్చిన రింకూ సింగ్ ధాటిగా ఆడాడు. డేంజరస్ ఆండ్రీ రస్సెల్‌(24)ను మార్కండే ఔట్ చేయడంతో కేకేఆర్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది.

ఓ వైపు రింకూ సింగ్ పోరాడినా.. మరోవైపు సునీల్ నరైన్(1), శార్దూల్ ఠాకూర్(8) దారుణంగా విఫలమయ్యారు. హాఫ్ సెంచరీకి చేరువైన రింకూ సింగ్‌ను నటరాజన్ ఔట్ చేయగా.. హర్షిత్ రాణా రనౌటయ్యాడు. దాంతో 200 పరుగులు చేస్తుందనుకున్న కేకేఆర్ 171 పరుగులకే పరిమితమైంది.

Story first published: Thursday, May 4, 2023, 21:28 [IST]
Other articles published on May 4, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+