Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH vs KKR: ఉప్పల్‌ మ్యాచ్‌లో ఉమ్రాన్ మాలిక్‌పై వేటు!

హైదరాబాద్: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఉప్పల్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని కేకేఆర్ సారథి నితీశ్ రాణా అన్నాడు. భారీ స్కోర్ చేసి ప్రత్యర్థిని కట్టడి చేస్తే విజయం దక్కుతుందన్నాడు.

ప్లే ఆఫ్స్ గురించి పెద్దగా ఆలోచించడం లేదని చెప్పిన రాణా.. ప్రతీ మ్యాచ్‌ను గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపాడు. చాలా మ్యాచ్‌ల్లో తమ జట్టును గాయాల బెడద వేధించిందని, స్టార్ ఆటగాళ్లంతా ఇప్పుడు అందుబాటులోకి వచ్చారని చెప్పాడు. ఇంపాక్ట్ రూల్ కారణంగా ఎక్స్‌ట్రా బ్యాటర్‌తో ఆడే అవకాశం ఉందని, 10-15 పరుగులు ఎక్కువ చేస్తే విజయానికి సులువవుతుందన్నాడు. జట్టులో రెండు మార్పులు చేశామని చెప్పిన రాణా.. జాసన్ రాయ్, వైభవ్ అరోరా జట్టులోకి వచ్చారని తెలిపాడు.

Umran Malik SRH

టాస్ గెలిస్తే తాము కూడా బ్యాటింగ్ ఎంచుకునేవాళ్లమని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్ చెప్పాడు. తద్వారా భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు ఉంచి డిఫెండ్ చేయాలనుకున్నామని తెలిపాడు. ఏది ఏమైనా టోర్నీలో నిలకగా రాణించాల్సిన అసరం తమకు ఉందని, ఈ రోజు మ్యాచ్ నుంచే ఇది మొదలు పెట్టాలన్నాడు.

సానుకూల ఫలితాల కోసం ఎదురు చూస్తున్నామని తెలిపిన మార్క్‌రమ్.. బ్యాటింగ్‌లో కాస్త మెరుగవ్వాల్సిన అవసరం ఉందన్నాడు. బౌలింగ్ అద్భుతంగా ఉన్నప్పటికీ.. బ్యాటింగ్‌లో మాత్రం సత్తా చాటలేకపోతున్నామని తెలిపాడు. తమ జట్టులో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయని తెలిపిన మార్క్‌రమ్.. కార్తీక్ త్యాగీ జట్టులోకి వచ్చాడని చెప్పాడు. పేలవ ప్రదర్శన కనబరుస్తున్న ఉమ్రాన్ మాలిక్‌పై వేటు వేసినట్లు స్పష్టం చేశాడు.

తుది జట్లు:

సన్‌రైజర్స్ హైదరాబాద్: మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ, ఎయిడెన్ మార్క్‌రమ్(కెప్టెన్), హెన్రీచ్ క్లాసెన్, హ్యారీ బ్రూక్, అబ్దుల్ సమద్, మార్కో జాన్సెన్, మయాంక్ మార్కండే, భువనేశ్వర్ కుమార్, కార్తీక్ త్యాగీ, టీ నటరాజన్

కేకేఆర్: రెహ్మానుల్లా గుర్బాజ్(కీపర్), జాసన్ రాయ్, వెంకటేశ్ అయ్యర్, నితీశ్ రాణా(కెప్టెన్), ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తీ.

Story first published: Thursday, May 4, 2023, 19:26 [IST]
Other articles published on May 4, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+