Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH vs KKR: మళ్లీ డకౌటైన హ్యారీ బ్రూక్.. నెట్టింట పేలుతున్న మీమ్స్!

హైదరాబాద్: ఐపీఎల్ 2023 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో గురువారం ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లోనూ హ్యారీ బ్రూక్(0) డకౌట్‌గా వెనుదిరిగాడు. నాలుగు బంతులే ఎదుర్కొన్న హ్యారీ బ్రూక్.. స్వీప్ షాట్ ఆడే క్రమంలో వికెట్ల ముందు దొరికిపోయాడు. అనుకుల్ రాయ్ బౌలింగ్‌లో హ్యారీ బ్రూక్ ఫోర్ బాల్ డక్‌గా వెనుదిరిగాడు.

పేలవ ప్రదర్శనతో బ్యాటింగ్ ఆర్డర్‌‌లో డీమోట్ అయ్యి మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన హ్యారీ బ్రూక్ ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయాడు. దాంతో ఈ ఇంగ్లండ్ క్రికెటర్‌పై అభిమానులు మండిపడుతున్నారు. బలహీనంగా ఉన్న బ్యాటింగ్ విభాగాన్ని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో
రూ.13.25 కోట్ల భారీ ధరకు హ్యారీ బ్రూక్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.

Harry Brook SRH

కానీ అతను ఈ సీజన్‌లో వరుసగా 13(21), 3(4), 13(14), 100*(55), 9(7), 18(13), 7(14), 0(2), 0(4) విఫలమయ్యాడు. కేకేఆర్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 55 బంతుల్లో అజేయ సెంచరీతో చెలరేగిన హ్యారీ బ్రూక్.. మళ్లీ అదే జట్టుతో సత్తా చాటుతాడని ఫ్యాన్స్ ఆశించారు. కానీ అతను సున్నాకే పెవిలియన్ చేరి తీవ్రంగా నిరాశపరిచాడు. హ్యారీ బ్రూక్ వరుసగా రెండో మ్యాచ్‌లో డకౌటవ్వడం గమనార్హం.

దాంతో హ్యారీ బ్రూక్‌పై అభిమానులు మండిపడుతున్నారు. రూ.13 కోట్లు పెట్టి శనిని కొనుక్కున్నామ్ కదరా? కొందరు అంటే.. హ్యారీ బ్రూక్ కాదు.. ఎర్రీ బ్రూక్ అంటూ ఫన్నీ మీమ్స్‌ ట్రెండ్ చేస్తున్నారు. వెంటనే హ్యారీ బ్రూక్‌ను జట్టు నుంచి తప్పించి గ్లేన్ ఫిలిప్స్‌ను ఆడించాలని డిమాండ్ చేస్తున్నారు. కావ్య పాప ఈ ఎర్రీ బ్రూక్ కోసం రూ.13.25 కోట్ల దండుగ చేసిందని విమర్శిస్తున్నారు. తాజా వైఫల్యంతో హ్యారీ బ్రూక్ బెంచ్‌కే పరిమితమవుతాడని, వాటర్ బాటిల్స్ మోయాల్సిందేనని మండిపడుతున్నారు.

ఫ్లాట్‌గా ఉంటే పాకిస్థాన్ బ్యాటింగ్ పిచ్‌లపై వరుస సెంచరీలతో చెలరేగిన ఎర్రీ బ్రూక్.. అసలు సిసలు సవాల్ విసిరే భారత పిచ్‌ల్లో మాత్రం దారుణంగా విఫలమవుతున్నాడని ఎగతాళి చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 171 పరుగులు చేసింది. కెప్టెన్ నితీశ్ రాణా(31 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 42), రింకూ సింగ్(35 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 46) రాణించారు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో నటరాజన్, మార్కో జాన్సెన్ రెండేసి వికెట్లు తీయగా.. భువనేశ్వర్ కుమార్, కార్తీక్ త్యాగీ, ఎయిడెన్ మార్క్‌రమ్, మయాంక్ మార్కండే తలో వికెట్ తీసారు.

Story first published: Thursday, May 4, 2023, 22:57 [IST]
Other articles published on May 4, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+