SRH vs KKR: రస్సెల్ కళ్లు చెదిరే క్యాచ్.. పోలా అదిరిపోలా! (వీడియో)
హైదరాబాద్: కోల్‌కతా నైట్‌రైడర్స్ స్టార్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రస్సెల్ కళ్లు చెదిరే క్యాచ్‌తో ఔరా అనిపించాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో గురువారం ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో రస్సెల్.. సూపర్ డైవ్ క్యాచ్‌తో ఆకట్టుకున్నాడు. రస్సెల్ అసాధారణ క్యాచ్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ(9) నిరాశగా పెవిలియన్ చేరాడు.
చాలా ఎత్తుకు వెళ్లిన ఈ క్యాచ్‌ను రస్సెల్ అద్భుతంగా అందుకున్నాడు. చివరి వరకు బంతిపై దృష్టి మలచని రస్సెల్.. చేప పిల్లలానే సూపర్ డైవ్‌తో అందుకున్నాడు. ఈ స్టన్నింగ్ క్యాచ్‌కు అభిషేక్ శర్మ బిత్తర పోయాడు. ప్రస్తుతం ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా కాగా.. 'రస్సెల్ జిగేల్ క్యాచ్.. పోలా అదిరిపోలా!'అని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

ఐపీఎల్ 2023 సీజన్ బెస్ట్ క్యాచ్‌ల్లో ఇది నిలుస్తుందని కామెంట్ చేస్తున్నారు. శార్దూల్ ఠాకూర్ వేసిన ఇన్నింగ్స్ 4వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ ఐదో బంతికి అభిషేక్ శర్మ.. భారీ షాట్ ఆడే ప్రయత్నం చేయగా.. మిస్ టైమ్ అయిన బంతి గాల్లోకి లేచింది. క్యాచ్ కోసం పరుగెత్తుకొచ్చిన రస్సెల్ అద్భుతంగా డైవ్ చేసి అందుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో 5 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ ఓటమిపాలైంది. ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 171 పరుగులు చేసింది. కెప్టెన్ నితీశ్ రాణా(31 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 42), రింకూ సింగ్(35 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 46) రాణించారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో నటరాజన్, మార్కో జాన్సెన్ రెండేసి వికెట్లు తీయగా.. భువనేశ్వర్ కుమార్, కార్తీక్ త్యాగీ, ఎయిడెన్ మార్క్‌రమ్, మయాంక్ మార్కండే తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 166 పరుగులే చేసి ఓటమిపాలైంది. కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్(40 బంతుల్లో 4 ఫోర్లతో 41), హెన్రీచ్ క్లాసెన్(20 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 36) రాణించినా ఫలితం లేకపోయింది. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ అరోరా, శార్దూల్ ఠాకూర్ రెండేసి వికెట్లు తీయగా.. హర్షిత్ రాణా, ఆండ్రీ రస్సెల్, అనుకుల్ రాయ్, వరుణ్ చక్రవర్తీ తలో వికెట్ పడగొట్టారు. ఆఖరి ఓవర్ వేసిన వరుణ్ చక్రవర్తీ మూడు పరుగులు మాత్రమే ఇచ్చి కేకేఆర్‌ను గెలిపించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications