Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH vs GT: తగ్గదేలే అంటున్న వరుణుడు.. తడిసిపోతున్న అభిమానులు!(వీడియో)

ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా ఉప్పల్ వేదికగా ప్రారంభం కావాల్సిన సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగిస్తూనే ఉంది. షెడ్యూల్ ప్రకారం రాత్రి 7 గంటలకే ప్రారంభం కావాల్సిన మ్యాచ్.. వర్షం కారణంగా ఇంకా ప్రారంభం కాలేదు. కనీసం టాస్ కూడా పడలేదు.

మ్యాచ్‌ ప్రారంభానికి ముందే కురిసిన భారీ వర్షంతో మైదానం మొత్తం చిత్తడిగా మారింది. మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచినా.. భారీ స్థాయిలో వర్షపు నీరు చేరింది. వరణుడు కాస్త శాంతించడంతో కవర్లను తీసేసిన మైదాన సిబ్బంది గ్రౌండ్‌ను సిద్దం చేసేందుకు తెగ కష్టపడ్డారు. వర్షపు నీరును పూర్తిగా తొలగించి చిత్తడిగా మారిన ఔట్ ఫీల్డ్‌ను ఆరబెట్టారు.

SRH vs GT Still raining in Hyderabad no signs of match

మైదానాన్ని ఆటకు సిద్దం చేసేందుకు దాదాపు 100 మంది సిబ్బంది శ్రమించారు. కవర్లు పూర్తిగా తీసేసి ఆటను ప్రారంభిద్దామనుకునే సమయానికి మళ్లీ వర్షం రావడంతో కవర్లను తీసుకొచ్చారు. ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుండటంతో ఆట ప్రారంభమయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఈ మ్యాచ్‌కు భారీ స్థాయిలో హాజరైన అభిమానులు.. వర్షం కారణంగా ఇబ్బంది పడుతున్నారు.

లోయర్ స్టాండ్స్‌‌లోని ప్రేక్షకులు వర్షానికి తడిచిపోతున్నారు. కనీసం 5 ఓవర్ల మ్యాచ్ నిర్వాహణకు కటాఫ్ టైమ్‌ను రాత్రి 10.30 గంటలుగా నిర్ణయించారు. ఆలోపు మ్యాచ్ సాధ్యమయ్యే అవకాశాలు ఉంటే 5 ఓవర్ల ఆటతో ఫలితాన్ని తేలుస్తారు. మైదానం చిత్తడిగా మారిన నేపథ్యంలో ఇరు జట్ల కెప్టెన్ల అంగీకారంతో ఆటను ప్రారంభిస్తారు.

చిత్తడిగా మారిన ఔట్ ఫీల్డ్‌లో ఆడటం ప్లేయర్లకు శ్రేయాస్కరం కాదు. గాయాల బారిన పడే అవకాశం ఉంటుంది. ఒకవేళ మ్యాచ్‌కు మైదానం సిద్దం చేసినా.. ఔట్ ఫీల్డ్ ప్రమాదకరంగా ఉంటే ఇరు జట్ల కెప్టెన్లు ఆటకు అంగీకారం తెలపకపోవచ్చు. ఎందుకంటే ఇరు జట్లకు ఇది ఏ మాత్రం కీలక మ్యాచ్ కాదు. ఇప్పటికే గుజరాత్ టైటాన్స్ ప్లే ఆఫ్స్ రేసు తప్పుకుంది.

ఈ మ్యాచ్ రద్దయితే సన్‌రైజర్స్ హైదరాబాద్ అధికారికంగా ప్లే ఆఫ్స్ చేరుతోంది. ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్ 14 పాయింట్స్‌తో టేబుల్‌లో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. మ్యాచ్ రద్దయితే ఆరెంజ్ ఆర్మీ ఖాతాలో ఒక పాయింట్ చేరుతోంది. అప్పుడు 15 పాయింట్స్‌తో మరో జట్టుతో సంబంధం లేకుండా ప్లే ఆఫ్స్ చేరుతోంది. పంజాబ్ కింగ్స్‌తో జరిగే చివరి మ్యాచ్‌లోనూ విజయం సాధిస్తే టాప్-2 ప్లేస్ దక్కుతుంది.

ఐపీఎల్ 2024 సీజన్ ముగిసిన వెంటనే టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇరు జట్ల కెప్టెన్లు చిత్తడిగా మారిన ఔట్ ఫీల్డ్‌లో ఫీల్డింగ్ చేసేందుకు ఆసక్తి చూపరు.

Story first published: Thursday, May 16, 2024, 21:43 [IST]
Other articles published on May 16, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+