Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH vs GT మ్యాచ్ రద్దు.. ప్లే ఆఫ్స్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్!

ఐపీఎల్ 2024 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్‌ చేరుకుంది. గురువారం ఉప్పల్ వేదికగా జరగాల్సిన గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్షం కారణంగా టాస్ పడకుండానే రద్దయ్యింది. దాంతో అంపైర్లు ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించడంతో 15 పాయింట్లతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది.

ఈ సాయంత్రం నుంచే కురిసిన భారీ వర్షంతో ఉప్పల్ మైదానం మొత్తం చిత్తడిగా మారింది. మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచినా.. భారీ స్థాయిలో వర్షపు నీరు చేరింది. వరణుడు కాస్త శాంతించడంతో కవర్లను తీసేసిన మైదాన సిబ్బంది గ్రౌండ్‌ను సిద్దం చేసేందుకు తెగ కష్టపడ్డారు. వర్షపు నీరును పూర్తిగా తొలగించి చిత్తడిగా మారిన ఔట్ ఫీల్డ్‌ను ఆరబెట్టారు.

SRH vs GT Match called off Hyderabad makes IPL playoffs

మైదానాన్ని ఆటకు సిద్దం చేసేందుకు దాదాపు 100 మంది సిబ్బంది శ్రమించారు. కవర్లు పూర్తిగా తీసేసి ఆటను ప్రారంభిద్దామనుకునే సమయానికి మళ్లీ వర్షం రావడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. ఎడతెరిపి లేకుండా వర్షం పడటంతో మ్యాచ్‌ను రద్దు చేయాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌కు భారీ స్థాయిలో హాజరైన అభిమానులు.. వర్షం కారణంగా ఇబ్బంది పడ్డారు.

లోయర్ స్టాండ్స్‌‌లోని ప్రేక్షకులు వర్షానికి తడిచిపోయారు. కనీసం 5 ఓవర్ల మ్యాచ్ నిర్వాహణకు కటాఫ్ టైమ్‌ను రాత్రి 10.30 గంటలుగా నిర్ణయించినా.. ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారడంతో మ్యాచ్ నిర్వహించలేమని అంపైర్లు ప్రకటించారు. ప్లేయర్ల భద్రతను పరిగణలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నారు. మ్యాచ్ రద్దయినా... ప్లే ఆఫ్స్ చేరామనే సంతోషాన్ని సన్‌రైజర్స్ ఆటగాళ్లు, అభిమానులు వ్యక్తం చేశారు.

SRH vs GT Match called off Hyderabad makes IPL playoffs

పంజాబ్ కింగ్స్‌తో జరిగే తమ చివరి మ్యాచ్‌‌లో విజయం సాధిస్తే సన్‌రైజర్స్ హైదరాబాద్ టాప్-2 బెర్త్‌ను దక్కించుకునే అవకాశం ఉంది. అయితే రాజస్థాన్ రాయల్స్ తమ చివరి మ్యాచ్‌లో ఓడిపోవాల్సి ఉంటుంది. తాజా మ్యాచ్ రద్దవ్వడంతో కేకేఆర్, రాజస్థాన్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ చేరగా.. నాలుగో స్థానం కోసం సీఎస్‌కే, ఆర్‌సీబీ తలపడనున్నాయి.

శనివారం బెంగళూరు వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ 18 పరుగులు లేదా 18.1 ఓవర్లలో లక్ష్యాన్ని పూర్తి చేసి విజయం సాధిస్తే మెరుగైన రన్‌రేట్‌తో ప్లే ఆఫ్స్ చేరుతుంది. లేదంటే చెన్నై సూపర్ కింగ్స్ ముందడుగు వేస్తోంది.

Story first published: Thursday, May 16, 2024, 22:32 [IST]
Other articles published on May 16, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+