Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH vs GT: అందుకే హర్షల్ పటేల్‌ను తప్పించి ఉనాద్కత్‌ను తీసుకున్నాం: కమిన్స్

ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఉప్పల్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అన్నాడు. పిచ్ చూడటానికి స్లో వికెట్‌లా కనిపిస్తుందని తెలిపాడు. 'మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. పిచ్ చూడటానికి స్లో వికెట్‌‌లా కనిపిస్తోంది. ఇక్కడ జరిగిన గత రెండు మ్యాచ్‌ల కంటే ఈ వికెట్ భిన్నంగా ఉంది.

సాధారణంగా ఉప్పల్ వికెట్‌ బాగుంటుంది. ఈ టోర్నీలో మేం అద్భుతంగా ఆడుతున్నాం. వీలైనంత త్వరగా పరిస్థితులను అందిపుచ్చుకోవాలి. గతంలో ఇక్కడ మాకు అనుకూల ఫలితాలు దక్కాయి. మేం ఇదే జోరును కొనసాగించాలనుకుంటున్నాం. తుది జట్టులో ఒక మార్పు చేశాం. అర్షద్ ఖాన్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ జట్టులోకి వచ్చాడు.'అని శుభ్‌మన్ గిల్ చెప్పుకొచ్చాడు.

SRH vs GT IPL 2025 Pat Cummins says Harshal Patel misses as he is ill Jaydev Unadkat comes in

హర్షల్‌కు అస్వస్థత..
మరోవైపు టాస్ గెలిచినా తాము బ్యాటింగే ఎంచుకునేవాళ్లమని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అన్నాడు. 'ముందుగా బ్యాటింగ్ చేయడం సంతోషంగా ఉంది. మేం దూకుడుగా ఆడాలనుకుంటున్నాం. మా బ్యాటింగ్‌కు సరిపోయే మైదానం ఇది. ఇదే మైదానంలో మేం 280 పరుగులు చేశాం. మేం అత్యుత్తమ ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉంది. మా బలాలకు తగ్గట్లు ఆడాలి. అనారోగ్యంతో ఈ మ్యాచ్‌కు హర్షల్ పటేల్ దూరమయ్యాడు. అతని స్థానంలో జయదేవ్ ఉనాత్కత్ తుది జట్టులోకి వచ్చాడు.'అని ప్యాట్ కమిన్స్ చెప్పుకొచ్చాడు.

తుది జట్లు:

సన్‌రైజర్స్ హైదరాబాద్: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, కామిందు మెండిస్, హెన్రిచ్ క్లాసెన్(కీపర్), అనికేత్ వర్మ, పాట్ కమిన్స్(కెప్టెన్), జీషన్ అన్సారీ, జయదేవ్ ఉనద్కత్, మహమ్మద్ షమీ.

గుజరాత్ టైటాన్స్ : సాయి సుదర్శన్, శుభమన్ గిల్(సి), జోస్ బట్లర్(కీపర్), షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, వాషింగ్టన్ సుందర్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాంత్ శర్మ.

Story first published: Sunday, April 6, 2025, 19:17 [IST]
Other articles published on Apr 6, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+