For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

SRH vs GT: సన్‌రైజర్స్ హైదరాబాద్ కొంప ముంచిన హైదరాబాదీ!

ఐపీఎల్ 2025 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ ఆరెంజ్ ఆర్మీ ఓటమిపాలైంది. గుజరాత్ టైటాన్స్ ఉప్పల్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 7 వికెట్ల తేడాతో చిత్తయ్యింది. మరోసారి పేలవ బ్యాటింగ్‌ సన్‌రైజర్స్ కొంపముంచింది. లోకల్ భాయ్ మహమ్మద్ సిరాజ్(4/17)కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్‌తో సన్‌రైజర్స్ పతనాన్ని శాసించాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 152 పరుగులు చేసింది. నితీష్ కుమార్ రెడ్డి(34 బంతుల్లో 3 ఫోర్లతో 31), హెన్రీచ్ క్లాసెన్(19 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 27) టాప్ స్కోరర్లుగా నిలవగా.. ప్యాట్ కమిన్స్(9 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 22 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో మహమ్మద్ సిరాజ్(4/17) నాలుగు వికెట్లతో సన్‌రైజర్స్ హైదరాబాద్ పతనాన్ని శాసించాడు. ప్రసిధ్ కృష్ణ, సాయి కిషోర్ రెండేసి వికెట్లు తీసాడు.

SRH vs GT IPL 2025 Mohammed Siraj and Shubman Gill Helps Gujarat Titans Beat Sunrisers Hyderabad

అనంతరం గుజరాత్ టైటాన్స్ 16.4 ఓవర్లలో 3 వికెట్లకు 153 పరుగులు చేసి గెలుపొందింది. శుభ్‌మన్ గిల్(43 బంతుల్లో 9 ఫోర్లతో 61 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. వాషింగ్టన్ సుందర్(29 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 49), షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్(16 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 35 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. సన్‌రైజర్స్ బౌలర్లలో మహమ్మద్ షమీ(2/28) రెండు వికెట్లు తీయగా.. ప్యాట్ కమిన్స్ ఓ వికెట్ పడగొట్టాడు.

చెలరేగిన సుందర్, గిల్..
స్వల్ప లక్ష్యచేధనకు దిగిన గుజరాత్ టైటాన్స్‌కు ఆశించిన శుభారంభం దక్కలేదు. ఆరంభంలోనే సాయి సుదర్శన్‌(5)ను మహమ్మద్ షమీ పెవిలియన్ చేర్చాడు. ఆ మరుసటి ఓవర్‌లోనే జోస్ బట్లర్(0)ను ప్యాట్ కమిన్స్ డకౌట్ చేశాడు. దాంతో మ్యాచ్ హోరాహోరీగా సాగుతుందని అంతా అనుకున్నారు. కానీ వాషింగ్టన్ సుందర్, శుభ్‌మన్ గిల్ ఆచితూచి ఆడారు. దాంతో గుజరాత్ టైటాన్స్ పవర్ ప్లేలో 2 వికెట్లు కోల్పోయి 48 పరుగులే చేసింది. సాధికారికంగా బ్యాటింగ్ చేసిన జోడీ.. వీలు చిక్కిన బంతిని బౌండరీకి తరలించింది.

సుందర్ ఔటైనా..
90 పరుగుల భాగస్వామ్యంతో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని షమీ విడదీసాడు. హాఫ్ సెంచరీకి చేరువైన వాషింగ్టన్ సుందర్(49)‌ను అనికేత్ వర్మ స్టన్నింగ్ క్యాచ్‌తో పెవిలియన్ చేర్చాడు. అయితే ఈ క్యాచ్ అందుకునే క్రమంలోబంతి నేలకు తాకినట్లు కనిపించింది. కానీ అంపైర్ అనికేత్ వర్మ చేతి వేళ్లు బాల్ కింద ఉన్నాయని చెప్పి ఔటిచ్చాడు. షెర్ఫెన్ రూథర్‌ఫోర్డ్(23 నాటౌట్) సాయంతో శుభ్‌మన్ గిల్ గుజరాత్‌ను విజయం దిశగా నడిపించాడు. 36 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న గిల్.. అనంతరం దూకుడుగా ఆడాడు. రూథర్ పోర్డ్ సైతం బౌండరీలు బాదడంతో గుజరాత్ విజయం లాంఛనమైంది.

Story first published: Sunday, April 6, 2025, 23:06 [IST]
Other articles published on Apr 6, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+