For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Hardik Pandya vs Mohammed Shami: క్యాచ్ పట్టక ఏం పీ....న్నావ్? గుజరాత్ కెప్టెన్ నోట గలీజ్ మాట! (వీడియో)

SRH vs GT: Hardik Pandya Shouts On Mohammed Shami For Not Taking Rahul Tripathi Catch

ముంబై: గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తీవ్ర అసహనానికి గురయ్యాడు. తన కంటే సీనియర్ అయిన మహమ్మద్ షమీకి కనీస గౌరవం ఇవ్వకుండా అతనిపై గట్టిగా అరిచాడు. అంతటితో ఆగకుండా అసభ్యపదజాలాన్ని ఉపయోగించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా విఫలమైన గుజరాత్ 8 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.

ఈ సీజన్‌లో గుజరాత్‌కు ఇదే తొలి పరాజయం. అయితే తన బౌలింగ్‌లో సన్‌రైజర్స్ బ్యాట్సమన్ రాహుల్ త్రిపాఠి ఇచ్చిన కష్టమైన క్యాచ్‌ను మహమ్మద్ షమీ నేలపాలు చేశాడని హార్దిక్ ఆగ్రహానికి గురయ్యాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. హార్దిక్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అసలేం జరిగిందంటే..?

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్ 13వ ఓవర్‌ను హార్దిక్ పాండ్యా వేయగా.. రెండు, మూడు బంతులను కేన్ విలియమ్సన్ భారీ సిక్సర్లుగా మలిచాడు. ఇక ఈ ఓవర్ చివరి బంతిని బ్యాక్ ఆఫ్ లెంగ్త్‌గా పాండ్యా వేయగా.. రాహుల్ త్రిపాఠి అప్పర్ కట్ ఆడాడు. దాంతో బంతి గాల్లోకి లేచి నేరుగా డీప్ థర్డ్ మ్యాన్‌లో పడింది.

అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న మహమ్మద్ షమీ ఆ బంతిని అందుకోలేకపోయాడు. అతనికి రెండు అడుగల ముందే బంతి పడగా షమీ క్యాచ్ కోసం కనీస ప్రయత్నం చేయలేదు. దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన హార్దిక్ పాండ్యా.. షమీపై గట్టిగా అరిచేసాడు. క్యాచ్ పట్టక ఏం పీ..తున్నావ్? అని హిందీలో అసభ్య పదజాలాన్ని ఉపయోగించాడు. హార్దిక్ తీరు పట్ల షమీ నిర్ఘాంతపోయాడు.

ఇంత అహంకారమా?

ఇంత అహంకారమా?

హార్దిక్‌ పాండ్యా తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. హార్దిక్‌లో నాయకుడి లక్షణాలు లేవని, జట్టు సభ్యుల పట్ల అమర్యాదగా ప్రవర్తించడం సరికాదని విమర్శిస్తున్నారు. అసలు కెప్టెన్సీ చేయడానికి అతడు అర్హుడే కాదంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. సన్‌రైజర్స్‌ జట్టులో అభిషేక్‌ శర్మ, రాహుల్‌ త్రిపాఠి వంటి వాళ్లు కూడా క్యాచ్‌లు వదిలేశారని, అయినా కేన్‌ విలియమ్సన్‌ సంయమనం పాటించాడని గుర్తు చేస్తున్నారు.

హార్దిక్ మాత్రం టీమిండియాలో సీనియర్‌ అయిన షమీ మీదకు అరుస్తాడా? కెప్టెన్‌ అయ్యానని అహంకారమా? అని మండిపడుతున్నారు. కెప్టెన్సీలో ధోనీతో పోటీ పడతానని చెప్పిన హార్దిక్.. జార్ఖండ్ డైనమైట్ మిస్టర్‌ కూల్‌ అన్న విషయం మరిచిపోయాడా? అని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇదే తొలిసారి కాదు..

ఇదే తొలిసారి కాదు..

ఇక హార్దిక్ ఇలా అరవడం ఇదే తొలిసారి కాదు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ అతను సహనం కోల్పోయాడు. ముందుగా ఫీల్డింగ్‌లో తప్పిదం చేసిన యువ ప్లేయర్‌ దర్శన్‌పై అరిచిన హార్దిక్ పాండ్యా.. ఆ తర్వాత బ్యాటింగ్‌లో రనౌట్ అయిన బాధలో మిల్లర్‌పై అరిచాడు. వాస్తవానికి రనౌట్ విషయంలో మిల్లర్‌ది ఏం తప్పులేదు. హార్దిక్ పాండ్యానే పరుగెత్తి రనౌటయ్యాడు. కెప్టెన్ ఇలా ఆటగాళ్లపై అరవడం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.

కేన్ మామ సూపరో సూపర్..

కేన్ మామ సూపరో సూపర్..

ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా (42 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 50 నాటౌట్‌) అర్ధ సెంచరీ చేయగా, అభినవ్‌ మనోహర్‌ (21 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 35) రాణించాడు. అనంతరం హైదరాబాద్‌ 19.1 ఓవర్లలో 2 వికెట్లకు 168 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్‌ విలియమ్సన్‌ (46 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు 57) హాఫ్‌ సెంచరీ సాధించగా, అభిషేక్‌ శర్మ (32 బంతుల్లో 6 ఫోర్లతో 42), పూరన్‌ (18 బంతు ల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 34 నాటౌట్‌) మెరిశారు.

Story first published: Tuesday, April 12, 2022, 10:16 [IST]
Other articles published on Apr 12, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+