Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH vs DC: ఒక్క సెంచరీకే సల్ల పడ్డావ్ ఏందిరా ఎర్రీ బ్రూక్! పేలుతున్న మీమ్స్!

హైదరాబాద్: ఐపీఎల్ 2023 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ వైఫల్యం కొనసాగుతోంది. వరుసగా ఏడో మ్యాచ్‌లోనూ అతను దారుణంగా విఫలమయ్యాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఉప్పల్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో హ్యారీ బ్రూక్ 14 బంతుల్లో 7 పరుగులే చేసి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అన్రిచ్ నోర్జ్ బౌలింగ్‌లో ఇన్నోవేటివ్ షాట్ ఆడే క్రమంలో పెవిలియన్ చేరాడు. దాంతో హ్యారీ బ్రూక్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులు మండిపడుతున్నారు.

రూ.13.25 కోట్ల భారీ ధరకు హ్యారీ బ్రూక్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేయగా.. అతను కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో 55 బంతుల్లో సెంచరీ బాదాడు. ఈ ఒక్క ఇన్నింగ్స్ తప్ప మరే మ్యాచ్‌లోనూ ఆడలేదు. ఈ సీజన్‌లో హ్యారీ బ్రూక్ వరుసగా 13(21), 3(4), 13(14), 100*(55), 9(7), 18(13), 7(14) విఫలమయ్యాడు.

 Harry Brook

కేకేఆర్‌‌తో మ్యాచ్‌కు ముందు మూడు మ్యాచ్‌లు విఫలమవడంతో భారత అభిమానులు తీవ్రంగా ట్రోలింగ్ చేశారు. దాంతో కేకేఆర్‌పై సెంచరీ చేసిన అనంతరం బ్రూక్ అభిమానుల ట్రోలింగ్‌ను తప్పుబట్టాడు. తన ఆటతో వారి నోళ్లు మూయించానని గొప్పలు చెప్పుకున్నాడు. కానీ తర్వాత వరుసగా మూడు మ్యాచ్‌లు విఫలమవడంతో ఫ్యాన్స్ మరింత రెచ్చిపోతున్నారు.

ఎర్రీ బ్రూక్ అనే నిక్‌నేమ్‌తో విమర్శలు గుప్పిస్తున్నారు. ఒక్క సెంచరీకే సల్ల పడ్డావ్ ఏందీరా ఎర్రీ బ్రూక్ అంటూ ఫన్నీ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు.
వెంటనే హ్యారీ బ్రూక్‌ను జట్టు నుంచి తప్పించి గ్లేన్ ఫిలిప్స్‌ను ఆడించాలని డిమాండ్ చేస్తున్నారు. కావ్య పాప ఈ ఎర్రీ బ్రూక్ కోసం రూ.13.25 కోట్ల దండుగ చేసిందని విమర్శిస్తున్నారు.

ఈ మ్యాచ్‌లో కెమెరామెన్‌గా హ్యారీ బ్రూక్ ఫొటోలకు ఫోజివ్వగా.. కొత్త కెరీర్ ప్రారంభించాడని ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. క్రికెట్ కంటే కెమెరామెన్‌గా పనిచేయడమే ఉత్తమమని చెబుతున్నారు. పాకిస్థాన్ బ్యాటింగ్ పిచ్‌లపై చెలరేగిన ఎర్రీ బ్రూక్.. భారత పిచ్‌ల్లో దారుణంగా విఫలమవుతున్నాడని విమర్శిస్తున్నారు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 144 పరుగులు చేసింది. అక్షర్ పటేల్(34 బంతుల్లో 4 ఫోర్లతో 34), మనీశ్ పాండే(27 బంతుల్లో 2 ఫోర్లతో 34) మినహా అంతా విఫలమయ్యారు. సన్‌రైజర్స్ బౌలర్లలో సుందర్ మూడు వికెట్లు తీయగా.. భువీ రెండు వికెట్లు పడగొట్టారు. నటరాజన్‌కు ఓ వికెట్ దక్కింది.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన సన్‌రైజర్స్ 10 ఓవర్లలో వికెట్ నష్టానికి 60 పరుగులు చేసింది.

Story first published: Monday, April 24, 2023, 22:42 [IST]
Other articles published on Apr 24, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+