Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అందుకే పృథ్వీ షాను పక్కనపెట్టాం.. ఉప్పల్‌తో విడదీయని బంధం: డేవిడ్ వార్నర్

హైదరాబాద్: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఉప్పల్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉందనే ఈ నిర్ణయం తీసుకున్నానని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ తెలిపాడు. ఉప్పల్‌ మైదానంతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని, ఇక్కడి అభిమానులకు తనకు మద్దతుగా నిలుస్తారని చెప్పాడు. వాళ్లను తన ఆటతో ఎంటర్‌టైన్ చేయడంతోనే ఈ అభిమానాన్ని అందుకున్నానని తెలిపాడు.

ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యం ఉంచితే ఈ మ్యాచ్‌లో గెలవచ్చని, నిలకడగా రాణించడం చాలా ముఖ్యమన్నాడు. బ్యాటింగ్, బౌలింగ్‌లో పవర్ ప్లేలో రాణించడం చాలా కీలకం అన్నాడు. రిపల్ పటేల్ స్థానంలో సర్ఫరాజ్ ఖాన్ జట్టులోకి వచ్చాడని చెప్పాడు. వరుసగా విఫలమవుతున్న పృథ్వీ షాపై వేటు వేసామని తెలిపాడు.

SRH vs DC

మరోవైపు టాస్ గెలిస్తే తాము బౌలింగే తీసుకునేవాళ్లమని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఎయిడెన్‌ మార్క్‌రమ్ అన్నాడు. పిచ్ బౌలింగ్‌కు కూడా అనుకూలంగా ఉంటుందన్నాడు. టోర్నీలో ముందడుగు వేయాలంటే ఈ మ్యాచ్ గెలవడం తమకు చాలా ముఖ్యమని చెప్పాడు. తమ 16 మంది ఆటగాళ్లలో ఒక మార్పు చేశామని, లోకల్ ప్లేయర్ నితీశ్ రెడ్డిని తీసుకున్నామని తెలిపాడు. బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన నితీశ్ రెడ్డి ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఉపయోగపడనున్నాడని చెప్పాడు. ముంబైతో ఆడిన జట్టునే కొనసాగించామని, ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తామనే నమ్మకం ఉందని చెప్పాడు.

తుది జట్లు:
సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, హ్యారీ బ్రూక్, ఎయిడెన్ మార్క్‌రమ్, మయాంక్ అగర్వాల్, హెన్రీచ్ క్లాసెన్, మార్కో జాన్సెన్, వాషింగ్టన్ సుందర్, మయాంక్ మార్కండే, భువనేశ్వర్ కుమార్, టీ నటరాజన్, ఉమ్రాన్ మాలిక్

ఢిల్లీ క్యాపిటల్స్: డేవిడ్ వార్నర్, ఫిలిప్ సాల్ట్, మిచెల్ మార్ష్, మనీశ్ పాండే, సర్ఫరాజ్ ఖాన్, అక్షర్ పటేల్, ఆమన్ ఖాన్, రిపల్ పటేల్, అన్రిచ్ నోర్జ్, కుల్దీప్ యాదవ్, ఇషాంత్ శర్మ

Story first published: Monday, April 24, 2023, 19:26 [IST]
Other articles published on Apr 24, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+