Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH vs DC: భువనేశ్వర్ కుమార్ కాళ్లు మొక్కిన డేవిడ్ వార్నర్ (వీడియో)

హైదరాబాద్: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా ఢిల్లీక్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరుగుతున్న మ్యాచ్ సందర్భంగా ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్.. సన్‌రైజర్స్ స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ కాళ్లు మొక్కాడు.
ఈ మ్యాచ్‌లో రాణించేలా ఆశీర్వదించమని కోరాడు.

టాస్ అనంతరం నేరుగా భువనేశ్వర్ దగ్గరకు వెళ్లి కాళ్లు మొక్కిన వార్నర్ అతన్ని కౌగిలించుకున్నాడు. చాలా ఏళ్లపాటు ఈ ఇద్దరూ కలిసి సన్‌రైజర్స్‌కు ప్రాతినిథ్యం వహించారు. డేవిడ్ వార్నర్ సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా వ్యవహరించగా.. భువనేశ్వర్ కుమార్ అతనికి డిప్యూటీగా కొనసాగాడు. దాంతో వీరి మధ్య మంచి బాండింగ్ ఉండేది.

 David Warner touches Bhuvneshwar Kumar

ఈ క్రమంలోనే ఏడాది తర్వాత ఢిల్లీ కెప్టెన్‌గా వార్నర్.. హైదరాబాద్‌లో అడుగుపెట్టగా.. భూవీ కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నాడు. ఈ వీడియోను ఐపీఎల్ నిర్వాహకులు ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకోగా.. వైరల్ అయ్యింది. ఇక ఫ్యాన్స్ ఫన్నీ కామెంట్ చేస్తున్నారు. ఈ మ్యాచ్ ఔట్ చేయవద్దని భువీని వార్నర్ కోరాడని సెటైర్లు పేల్చుతున్నారు.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ బ్యాటింగ్ ఎంచుకోగా.. ఉప్పల్‌ మైదానంతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని డేవిడ్ వార్నర్ చెప్పాడు. ఇక్కడ తనను అభిమానించేవారు చాలా మంది ఉన్నారని, తన ఆటతోనే ఆ అభిమానాన్ని అందుకున్నానని తెలిపాడు.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ మరోసారి పేలవ ప్రదర్శన కనబర్చింది. భువనేశ్వర్ కుమార్ వేసిన తొలి ఓవర్‌లోనే ఓపెనర్ ఫిల్ సాల్ట్(0) గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరాడు. క్రీజులోకి వచ్చిన మిచెల్ మార్ష్.. మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో వరుసగా 4 బౌండరీలు బాది జోరు కనబర్చినా... నటరాజన్‌ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. దాంతో ఢిల్లీ పవర్ ప్లేలో 2 వికెట్లకు 49 పరుగులు చేసింది.

అయితే వాషింగ్టన్ సుందర్ 8వ ఓవర్‌‌లో ఢిల్లీకి ట్రిపుల్ స్ట్రోక్ ఇచ్చాడు. ఒకే ఓవర్‌లో డేవిడ్ వార్నర్(21), సర్ఫరాజ్ ఖాన్(10), ఆమన్ హకీమ్ ఖాన్(4)లను పెవిలియన్ చేర్చాడు. దాంతో ఢిల్లీ 62 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో మనీష్ పాండే, అక్షర్ పటేల్ నిదానంగా ఆడుతూ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు.

ఆరో వికెట్‌కు 69 పరుగులు జోడించారు. క్రీజులో ప్రమాదకరంగా మారిన ఈ జోడీ భువీ విడదీసాడు. అక్షర్ పటేల్(34)ను క్లీన్ బౌల్డ్ చేయగా.. మనీశ్ పాండే రనౌటయ్యాడు. దాంతో ఢిల్లీ స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది.

Story first published: Monday, April 24, 2023, 21:22 [IST]
Other articles published on Apr 24, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+