SRH vs DC: సూపర్ ఓవర్‌లో ఓటమి.. సన్‌రైజర్స్‌ను ముంచిన ఆ నాలుగు తప్పిదాలు ఇవే!!

హైదరాబాద్: టీ20 మజా అంటే.. ఇదే కదా అన్నట్టు సాగింది ఆదివారం చెన్నైలోని చెపాక్ మైదానంలో జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్. ఆఖరి బంతి వరకు రెండు జట్లతో విజయం దోబూచులాడినా.. చివరకు 'సూపర్' ముగింపు ఢిల్లీకే దక్కింది. ఐపీఎల్ 2021 సీజన్‌లో తొలిసారి సూపర్ ఓవర్‌లో ఫలితం తేలిన మ్యాచ్‌లో హైదరాబాద్‌పై క్యాపిటల్స్ విజయం సాధించింది.
సూపర్ ఓవర్‌లో మొదట హైదరాబాద్ 7 పరుగులు చేయగా.. అనంతరం ఛేదనలో రిషబ్ పంత్ ధాటిగా ఆడటంతో సన్‌రైజర్స్‌కు ఓటమి తప్పలేదు. గెలిచే మ్యాచుని సన్‌రైజర్స్ చేజేతులారా పోగొట్టుకుంది. వార్నర్ సేన ఓటమి గలప్రధాన కారణాలను ఓసారి పరిశీలిద్దాం.

షార్ట్ రన్ తప్పిదం
సూపర్ ఓవర్‌లో కేన్ విలియమ్సన్‌తో కలిసి బ్యాటింగ్‌కి వచ్చిన డేవిడ్ వార్నర్.. మూడు బంతులు ఎదుర్కొని కేవలం రెండు పరుగులు మాత్రమే చేశాడు. చివరి బంతికి వార్నర్ డబుల్ తీసినా.. నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో క్రీజు లోపల అతడు బ్యాట్ ఉంచలేదని తేల్చిన అంపైర్ షార్ట్ రన్ తప్పిదం కింద ఒక పరుగు మాత్రమే ఇచ్చాడు. దాంతో ఢిల్లీ టార్గెట్ 9 పరుగుల నుంచి 8 పరుగులకి తగ్గింది. సూపర్ ఓవర్‌లో రషీద్ ఖాన్ మెరుగ్గా బౌలింగ్ చేయడంతో ఢిల్లీ తడబడింది. అయితే ఆఖరి బంతికి సింగిల్ తీసి మ్యాచ్‌లో విజయం సాధించింది. ఒకవేళ షార్ట్ రన్ పరుగు కూడా ఉండుంటే.. మ్యాచ్ మరో సూపర్ ఓవర్‌కి వెళ్లేది. అప్పుడు హైదరాబాద్ గెలిచే అవకాశం ఉండేది.

బెయిర్‌స్టో ఉండగా బ్యాటింగ్‌కి వెళ్లిన వార్నర్
జానీ బెయిర్‌స్టో లాంటి పవర్ హిట్టర్ టీమ్‌లో ఉండగా.. కేన్ విలియమ్సన్‌తో కలిసి డేవిడ్ వార్నర్ సూపర్ ఓవర్‌లో బ్యాటింగ్‌కి వెళ్లడం కూడా సన్‌రైజర్స్‌కు ఏమాత్రం కలిసిరాలేదు. ఆ ఓవర్లో చేసింది 7 పరుగులే. ఎడమచేతి వాటం స్పిన్నర్ అక్షర్ పటేల్ విసిరిన బంతుల్ని వార్నర్ సరిగా కనెక్ట్ కూడా చేయలేకపోయాడు. సూపర్ ఓవర్‌లో మూడు బంతులాడిన.. వార్నర్ రెండు పరుగులే చేయడం సన్‌రైజర్స్ ఓటమికి మరో కారణం. వార్నర్ పూర్ కెప్టెన్సీ కూడా ఓటమికి ఇంకో కారణం. కీలక సమయాల్లో ఫీల్డింగ్, బౌలింగ్ మార్పులు సరైన రీతిలో చేయలేకపోయాడు.
CSK vs RCB: విరాట్ కోహ్లీకి భారీ జరిమానా.. అంతా రవీంద్ర జడేజానే చేశాడు!!

విరాట్ స్లో బ్యాటింగ్
విరాట్ సింగ్ ఇన్నింగ్స్ హైదరాబాద్ మ్యాచ్ గతినే మార్చేసింది. ఒకవైపు విలియమ్సన్ బౌండరీలు బాదుతూ స్ట్రైక్ రొటేట్ చేస్తుంటే.. మరోవైపు విరాట్ మాత్రం బంతిని ఎదుర్కోవడానికే నానా తంటాలు పడ్డాడు. 14 బంతుల్లో 4 పరుగులే చేసి ఔట్ అయ్యాడు. వరుసగా డాట్ బాల్స్ ఆడుతూ చివరకు అవేశ్ ఖాన్ వేసిన 12వ ఓవర్లో క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దాదాపు 3-4 ఓవర్లు క్రీజులో ఉన్న విరాట్ పరుగులే చేయలేదు. దీంతో సన్‌రైజర్స్ రన్ రేట్ పూర్తిగా పడిపోయింది. ఒకవేళ విరాట్ ధాటిగా ఆడుంటే.. ఫలితం మరోలా ఉండేది.

చెన్నై పిచ్‌పై ఖలీల్ విఫలం
బౌలర్లు అనుకూలించే చెన్నై పిచ్‌పై హైదరాబాద్ బౌలర్లు అందరూ రెచ్చిపోతే.. ఖలీల్ అహ్మద్ మాత్రం ధారాళంగా పరుగులు ఇచ్చాడు. కౌల్, సుచిత్, శంకర్, రషీద్ పొదుపుగా బౌలింగ్ చేయగా.. ఖలీల్ తన కోటా 4 ఓవర్లలో 42 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. చెపాక్ పిచ్‌పై ఓవర్కు 10కి పైగా పరుగులు ఇవ్వడం సన్‌రైజర్స్ ఓటమికి మరో కారణం. ఒకవేళ ఖలీల్ పొదుపుగా బౌలింగ్ చేసుంటే ఢిల్లీ మరో 10-15 పరుగులు తక్కువే చేసుండేది.

మిడిల్ ఆర్డర్ సమస్య
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మొదటి నుంచి ఉన్న ప్రధాన సమస్య మిడిల్ ఆర్డర్. మిడిల్ ఆర్డర్లో ఎంతో మందిని ప్రయత్నించినా ఫలితం లేకుండా పోతుంది. శంకర్ (8), విరాట్ (4), అభిషేక్ (5) ఎవరూ కూడా జట్టును ఆదుకోవట్లేదు. ఇక జాదవ్ (9) ఢిల్లీ మ్యాచ్ ఆడినా త్వరగానే ఔట్ అయ్యాడు. మనీష్ పరుగులు చేస్తున్నా.. వేగంగా ఆడలేకపోయున్నాడు. సాహా, సమద్ ఇప్పటికే విఫలమయ్యారు. మిడిల్ ఆర్డర్ బాగుంటే.. సన్‌రైజర్స్ దాదాపు అన్ని మ్యాచులు గెలిచేదే. ఇక మూడు క్యాచులు వదిలేయడం కూడా మ్యాచుపై ప్రభావం చూపింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications