For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

CSK vs RCB: విరాట్ కోహ్లీకి భారీ జరిమానా.. అంతా రవీంద్ర జడేజానే చేశాడు!!

RCB captain Virat Kohli fined Rs 12 lakh for maintaining a slow over rate against CSK
IPL 2021: Kohli Fined Rs 12 Lakh For RCB’s Slow Over - Rate | Oneindia Telugu

ముంబై: స్లో ఓవర్ రేట్ కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021లో మరో కెప్టెన్ బలయ్యాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సారథి విరాట్ కోహ్లీకి భారీ జరిమానా పడింది. ముంబైలోని వాంఖడే మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు స్లో ఓవర్ రేట్ నమోదు చేసింది. దాంతో ఐపీఎల్ నిబంధనల ప్రకారం స్లో ఓవర్ రేట్ కింద కెప్టెన్ విరాట్ కోహ్లీకి రూ.12 లక్షల జరిమానా విధించారు. ఇది మొదటి తప్పిదం కాబట్టి రూ.12 లక్షలతో సరిపెట్టారు. టోర్నీలో మరోసారి ఇదే రిపీట్ అయితే జరిమానా రెట్టింపవ్వనుంది.

కోహ్లీకి జరిమానా

కోహ్లీకి జరిమానా

విరాట్ కోహ్లీకి జరిమానా పడడానికి అసలు కారణం చెన్నై ఆల్‌రౌండర్‌ వీంద్ర జడేజానే. హర్షల్‌ పటేల్‌ వేసిన 20వ ఓవర్లో జడేజా (62 నాటౌట్: 28 బంతుల్లో 4x4, 5x6) వరుసగా 6 6 N(నోబాల్‌)6 6 2 6 4 బాదడంతో ఒకే ఓవర్లో 37 పరుగులు వచ్చాయి. జడ్డూ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో.. కోహ్లీ బౌలర్లతో ఎక్కువగా చర్చలు జరిపాడు. హర్షల్‌తో ఎక్కువ సమయం ముచ్చటించాడు. ఇక ఫీల్డింగ్ కూర్పు కోసం ఎక్కువ సమయం కేటాయించాడు. దీంతో మ్యాచ్ నిర్ణీత సమయం కంటే ఆలస్యమైంది. దీంతో ఐపీఎల్ అధికారులు కోహ్లీకి జరిమానా విధించారు.

నాలుగో కెప్టెన్ కోహ్లీ

నాలుగో కెప్టెన్ కోహ్లీ

ఐపీఎల్ 2021 సీజన్‌లో స్లో ఓవర్ రేట్ తప్పిదానికి పాల్పడి జరిమానాకి గురైన నాలుగో కెప్టెన్ విరాట్ కోహ్లీ. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, కోల్‌కతా నైట్‌రైడర్స్ సారథి ఇయాన్ మోర్గాన్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ జాబితాలో ఉన్నారు. నలుగురు మొదటిసారి స్లో ఓవర్ రేట్ నమోదు చేశారు కాబట్టి రూ.12 లక్షలు జరిమానాకి గురయ్యారు. టోర్నీలో మరోసారి ఇదే రిపీట్ అయితే జరిమానా రెట్టింపవ్వనుంది. మూడోసారి అలానే జరిగితే.. జరిమానాతో పాటు ఓ మ్యాచ్ నిషేధం కూడా పడుతుంది.

IPL 2021: Delhi Capitalsకు బిగ్ షాక్.. స్టార్ బౌలర్ ఔట్! అర్ధాంతరంగా తప్పుకోవడానికి కారణం అదే!

20 ఓవర్లను 90 నిమిషాల్లో వేయాలి

20 ఓవర్లను 90 నిమిషాల్లో వేయాలి

ఇటీవల బీసీసీఐ విధించిన నిబంధనల ప్రకారం గంటకు 14.1 ఓవర్లు పూర్తి చేయాలి. అలాగే 20 ఓవర్లను 90 నిమిషాల్లో పూర్తి చేయాలి. ఇందులో స్ట్రాటజిక్ టైమ్ ఔట్స్, అనూహ్య అంతరాయల సమయాన్ని మినహాయిస్తారు. కానీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత సమయంలో 20 ఓవర్లను పూర్తి చేయలేకపోయింది. దీంతో కెప్టెన్ విరాట్ కోహ్లీపై చర్యలు తీసుకుంటు జరిమానా విధించారు.

రెండోసారి టీమ్‌ ఈ స్లో ఓవర్ రేట్ తప్పిదానికి పాల్పడితే.. కెప్టెన్‌కి రూ.24 లక్షల జరిమానా, టీమ్‌లోని ఆటగాళ్లకి రూ. 6 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 25% కోత పడనుంది. మూడోసారి కూడా ఆ తప్పిదానికి పాల్పడితే.. టీమ్ కెప్టెన్‌కి రూ.30 లక్షలు జరిమానా, ఒక మ్యాచ్ నిషేధం పడనుంది. అలానే టీమ్‌లోని ఆటగాళ్లకి రూ.12 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 50% జరిమానా పడనుంది.

కోహ్లీసేనకు తొలి ఓటమి

కోహ్లీసేనకు తొలి ఓటమి

ఈ మ్యాచులో చెన్నై నిర్దేశించిన 192 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బెంగళూరు 9 వికెట్లు కోల్పోయి 122 పరుగులకు పరిమితమైంది. దీంతో చెన్నై 69 పరుగులతో విజయం సాధించింది. 'సర్' రవీంద్ర జడేజా ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో బెంగళూరును బెంబేలెత్తించాడు. బ్యాట్‌ (62 నాటౌట్‌), బంతి (3/13)తో రాణించి చెన్నై విజయంలో కీలకపాత్ర పోషించాడు. బెంగళూరు ఓపెనర్‌ దేవ్‌దత్‌ పడిక్కల్‌ (34; 15 బంతుల్లో 4x4, 2x6), గ్లెన్ మాక్స్‌వెల్‌ (22; 15 బంతుల్లో 3x4) టాప్‌ స్కోరర్లుగా నిలిచారు. ఈ సీజన్లో కోహ్లీసేనకు తొలి ఓటమి కాగా.. ఈ విజయంతో చెన్నై పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది.

Story first published: Monday, April 26, 2021, 10:04 [IST]
Other articles published on Apr 26, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+