
పుణే: ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ముందుగా బౌలింగ్ చేసి తాము అద్భుత విజయాలందుకున్నామని, అదే జోరును కొనసాగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నానని ఆరెంజ్ ఆర్మీ సారథి కేన్ విలియమ్సన్ తెలిపాడు. ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నామని చెప్పిన కేన్ మామ.. ఈ మ్యాచ్ కూడా ఆఖరి వరకు ఉత్కంఠగా సాగే అవకాశం ఉందన్నాడు. మైదాన పరిస్థితులను చక్కగా ఉపయోగించుకొని విజయం కోసం కృషి చేస్తామని చెప్పాడు.
జడేజా అనూహ్య నిర్ణయంతో మళ్లీ చెన్నై సూపర్ కింగ్స్ సారథ్య బాధ్యతలు అందుకున్న ధోనీ.. ఎల్లో జెర్సీలో తనను ఎప్పటికీ చూస్తారని చెప్పాడు. ఏదో పాత్రలో జట్టుతోనే తాను ఉంటానని స్పష్టం చేశాడు. అయితే ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకోవాల్సిన అవసరం తమ ఆటగాళ్లకు ఉందని చెప్పిన ధోనీ.. క్యాచ్‌లు నేలపాలు చేయడంతోనే ఈ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నామని చెప్పాడు.ఈ తప్పిదాలు పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్పాడు. జట్టులో రెండు మార్పులు చేసామని చెప్పిన ధోనీ.. బ్రావో, శివమ్ ధూబే స్థానాల్లో డేవాన్ కాన్వే, సిమ్రన్ జీత్ సింగ్ జట్టులోకి వచ్చారని చెప్పాడు.
{ipl_headtohead_cricket_58_244}
తుది జట్లు:
చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్, రాబిన్ ఊతప్ప, డేవాన్ కాన్వే, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ(కీపర్, కెప్టెన్), మిచెల్ సాంట్నర్, డ్వేన్ ప్రిటోరియస్, సిమ్రన్ జీత్ సింగ్, ముఖేష్ చౌదరి, మహీశ్ తీక్షణ
సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్(కెప్టెన్), రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్క్‌రమ్, నికోలస్ పూరన్(కీపర్), శశాంక్ సింగ్, వాషింగ్టన్ సుందర్, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, టీ నటరాజన్