Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH vs CSK: ఓటములకు కారణాలు చెప్పడం సరికాదు.. అప్పుడు కానిది ఇప్పుడు చేశాం: ధోనీ

SRH vs CSK: MS Dhoni says We didnt go our way last time, we have done that this year

షార్జా: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020లో విఫలమవ్వడం గురించి కారణాలు చెప్పడం సరికాదని చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే) ఎంఎస్ ధోనీ అన్నాడు. అందరికన్నా ముందు ప్లే ఆఫ్స్‌కు చేరడం చాలా సంతోషంగా ఉందని, ఇదెంతో ప్రత్యేకమని తెలిపాడు. గతేడాది పేలవ ఆట తీరుతో ప్లే ఆఫ్స్‌ చేరకుండా ఇంటిముఖం పట్టిన చెన్నై.. ఈసారి మాత్రం దుమురేపుతోంది. అందరికన్నా ముందు ప్లే ఆఫ్స్‌ బెర్తును ఖరారు చేసుకుంది. గురువారం రాత్రి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచులో ధోనీసేన 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో చెన్నై ఈ సీజన్‌లో తొమ్మిదో విజయం సాధించి 18 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.

ఇదెంతో ప్రత్యేకం

ఇదెంతో ప్రత్యేకం

మ్యాచ్‌ అనంతరం చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మాట్లాడుతూ ఐపీఎల్‌ చరిత్రలో గతేడాది తొలిసారి ప్లే ఆఫ్స్‌ చేరకుండా నిష్క్రమించిన నేపథ్యంలో.. తాము తిరిగి బలంగా పుంజుకొని వస్తామని అప్పుడే చెప్పినట్లు గుర్తుచేశాడు. 'అందరికన్నా ముందు ప్లేఆఫ్స్‌కు చేరడం చాలా సంతోషంగా ఉంది. ఇదెంతో ప్రత్యేకం.

ఎప్పుడూ మేం ప్లే ఆఫ్స్‌ చేరే జట్టని అందరికీ తెలిసిందే. అయితే ప్రతిసారి మ్యాచ్‌లు గెలవడం జరగదు. గతేడాది మాకు ఎన్నో విషయాలు కలిసిరాలేదు. అప్పుడు విఫలమవ్వడం గురించి కారణాలు చెప్పడం సరికాదు. అప్పుడు కానిది ఇప్పుడు చేశాం' అని ధోనీ చెప్పాడు.

సహాయక సిబ్బంది కూడా

సహాయక సిబ్బంది కూడా

'ఈ సీజన్‌లో చెన్నై ముందుకు వెళ్లడానికి ఆటగాళ్లు బాగా ఆడారు. ప్రతి ఒక్కరూ అద్భుతగా రాణించారు. ఆటలోని అన్ని విభాగాలను సమతుల్యంగా ఉంచడానికి వారు బాధ్యతలు తీసుకున్నారు. ఈ విజయంలో సహాయక సిబ్బంది కూడా ముఖ్య పాత్ర పోషించారు. వాళ్లకూ ఈ క్రెడిట్‌ దక్కుతుంది. ఇక ఈ పిచ్‌పై కాస్త ఎక్కువ బౌన్స్‌ ఉంది.

బౌలర్లు దానిని ఉపయోగించుకునేందుకు ప్రయత్నించారు. నేటి ఆటలో పరిస్థితులను ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని నేను బౌలర్లకు చెప్పాను. బంతి ప్రారంభంలో బాగా టర్న్ కాగా.. ఆ తర్వాత బ్యాట్‌పైకి రావడం ప్రారంభించింది. మా వాళ్లు బాగా బౌలింగ్ చేశారు. పిచ్‌పై బ్యాట్స్‌మెన్‌కు అవగాహక కలిగాక విజయవంతమయ్యారు' అని ఎంఎస్ ధోనీ తెలిపాడు.

టైటిల్ అందించిన ఆటగాడినే హోటల్ రూమ్‌లో కూర్చోబెడుతారా.. డ్రింక్స్ మోపిస్తారా?! ఫాన్స్ ఎలా ఒప్పుకుంటారు?

జట్టుకు వెన్నంటే ఉంటారు

జట్టుకు వెన్నంటే ఉంటారు

చివరగా అభిమానుల గురించి చెన్నై సూపర్‌ కింగ్స్‌ సీఎస్‌కే ఎంఎస్ ధోనీ మాట్లాడుతూ.. వారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదన్నాడు. గెలుపోటములతో సంబంధం లేకుండా.. జట్టుకు వెన్నంటే ఉన్నారన్నాడు. ఇప్పుడు వాళ్ల నమ్మకాన్ని నిలబెట్టినందుకు (ప్లే ఆఫ్స్‌ చేరడం) సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశాడు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచులో ధోనీ సిక్సర్‌తో చెన్నైకి విజయాన్ని అందించిన విషయం తెలిసిందే.

సిద్ధార్థ్‌ కౌల్‌ వేసిన 19.4 బంతిని ధోనీ స్టాండ్స్‌లోకి తరలించి తన జట్టును ఘనంగా ప్లే ఆఫ్స్‌కు తీసుకెళ్లాడు. మహీ సిక్సుకు సంబందించిన వీడియో ఆన్‌లైన్‌లో చక్కర్లుకొడుతోంది. ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 'మునుపటి మహీ వచ్చాడు' అని ట్వీట్లు చేస్తున్నారు.

అరుదైన ఘనత

అరుదైన ఘనత

ఈ మ్యాచులో సీఎస్‌కే కెప్టెన్ ఎంఎస్‌ ధోనీ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ ఆరంభం (మధ్యలో ఒక సీజన్‌ మినహా) నుంచి చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టుకే ఆడుతున్న ధోనీ.. వికెట్‌ కీపర్‌గా 100 క్యాచ్‌లు అందుకున్నాడు. వికెట్ కీపర్ వృద్దిమాన్‌ సాహా క్యాచ్‌ అందుకోవడం ద్వారా మహీ ఈ ఘనతను అందుకున్నాడు. ధోనీ తర్వాత ఒకే జట్టుకు ఆడుతున్న జాబితాలో సీఎస్‌కే స్టార్ బ్యాటర్, మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా రెండో స్థానంలో ఉన్నాడు. రైనా 98 క్యాచ్‌లు అందుకున్నాడు. ముంబై ఇండియన్స్‌ స్టార్ ప్లేయర్ కీరన్‌ పొలార్డ్‌ 94 క్యాచ్‌లతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.

Story first published: Friday, October 1, 2021, 11:33 [IST]
Other articles published on Oct 1, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+