ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో ఉప్పల్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఒక మార్పుతో బరిలోకి దిగింది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలో హర్ష్ దూబే స్థానంలో దిల్షాన్ మదుషంకను ఆడిస్తున్నట్లు సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఇషాన్ కిషన్ తెలిపాడు. స్వింగ్ రాబట్టడం కోసమే దిల్షాన్ మదుషంకను ఆడిస్తున్నామని చెప్పాడు. ఈ పిచ్‌పై ఆరంభంలో స్వింగ్ లభించే అవకాశం ఉందని టాస్ సందర్భంగా వెల్లడించాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ముందుగా బ్యాటింగ్‌కు దిగింది. అయితే టాస్ గెలిచినా తాము ముందుగా బ్యాటింగ్ ఎంచుకునేవాళ్లమని ఇషాన్ కిషన్ తెలిపాడు. 'మేం ముందుగా బ్యాటింగ్ చేయాలనుకున్నాం. వికెట్ చూడటానికి బాగుంది. కాబట్టి ఒక మంచి స్కోర్‌ను నమోదు చేయాలనుకుంటున్నాం. జట్టు కోసం ఆడాలి కానీ వ్యక్తిగత ప్రదర్శనల కోసం కాదు. ఇది సుదీర్ఘమైన టోర్నీ కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నామనేది ముఖ్యం కాదు.

ప్రతీ మ్యాచ్‌ను ఒక సవాల్‌గా తీసుకొని ముందుకు సాగాలి. ఆరంభంలో బంతి కొంచెం స్వింగ్ అవుతుందని అనుకుంటున్నా. బ్యాటర్లు బంతిని నిశితంగా గమనించి జాగ్రత్తగా ఆడాలి. ఆరంభంలో స్వింగ్ రాబట్టడం కోసం హర్ష్‌దూబే స్థానంలో దిల్షాన్ మదుషంకను ఆడిస్తున్నాం.'అని ఇషాన్ కిషన్ తెలిపాడు. అయితే దిల్షాన్ మదుషంక ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగనున్నాడు.
మరోవైపు టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని సీఎస్‌కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తెలిపాడు. 'మేం ముందుగా బౌలింగ్ చేయబోతున్నాం. ఇది చాలా మంచి ట్రాక్‌లా కనిపిస్తోంది. పిచ్‌లోపెద్దగా మార్పు ఉండకపోవచ్చు. అందుకే మేం ఛేజింగ్ చేయాలనుకుంటున్నాం. పాయింట్స్ టేబుల్‌లో మెరుగవ్వడం సంతోషంగా ఉంది.
రెండో మ్యాచ్ నుంచి మేం ప్రాథమిక అంశాలకు కట్టుబడి ఆడుతున్నాం. నిలకడగా రాణించడమే ఇక్కడ కీలకం. గత మ్యాచ్‌లో నూర్ అహ్మద్ చాలా బాగా బౌలింగ్ చేశాడు. అతను మళ్ళీ ఫామ్‌లోకి రావడం కలిసొచ్చే అంశం. అలాగే అన్షుల్ డెత్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. ఇది బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌లా ఉంది. కానీ మేం పరిస్థితులను అంచనా వేసి ఆడాలి.'అని రుతురాజ్ గైక్వాడ్ చెప్పుకొచ్చాడు.