For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

SRH vs CSK: దానం నాగేందర్ వార్నింగ్.. తెలుగోడికి చోటు!

ఐపీఎల్ 2024 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎట్టకేలకు తెలుగు ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డికి అవకాశం కల్పించింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో ఉప్పల్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో మయాంక్ అగర్వాల్ స్థానంలో నితీష్ కుమార్ రెడ్డిని తీసుకుంది. మయాంక్ అగర్వాల్ అస్వస్థతకు గురవ్వడంతో అతని స్థానంలో నితీష్ కుమార్ రెడ్డిని తీసుకున్నామని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తెలిపాడు.

ఇక నితీష్ కుమార్ రెడ్డికి చోటు ఇవ్వడంపై నెటిజన్లు సెటైర్లు పేల్చుతున్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వార్నింగ్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ భయపడి నితీశ్ కుమార్ రెడ్డికి అవకాశం ఇచ్చిందని కామెంట్ చేస్తున్నారు.

SRH vs CSK Fans trolls Danam Nagender after Sunrisers Hyderabad give a chance telugu player Nitish kumar reddy

దానం నాగేందర్‌ చెప్పిన మాటకు సన్‌రైజర్స్ హైదరాబాద్ కట్టుబడి ఉంటుందని, ఆయన చెప్పాడనే మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌ను జట్టు నుంచి తొలిగించందని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

ఇక ఈ మ్యాచ్ టికెట్ల విషయంలో హెచ్‌సీఏ, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ తీరును తప్పుబట్టిన దానం నాగేందర్.. సంచలన ఆరోపణలు చేశారు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు డేవిడ్ వార్నర్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు మ్యాచ్ ఫిక్సింగ్‌లకు పాల్పడ్డాడని తెలిపారు. ఈ విషయంపై తాను సన్‌రైజర్స్ హైదరాబాద్ మేనేజ్‌మెంట్‌కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశానని గుర్తు చేసుకున్నారు.

తన ఫిర్యాదుపై విచారణ చేపట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్ డేవిడ్ వార్నర్‌ను జట్టు నుంచి తొలిగించిందని చెప్పారు. ఉప్పల్ మ్యాచ్ టికెట్లను బ్లాక్‌లో అమ్మారని ఆరోపించిన ఆయన.. ఈ దందాపై ముఖ్యమంత్రితో పాటు క్రీడా మంత్రికి ఫిర్యాదు చేస్తానని తెలిపారు. హైదరాబాద్ ఫ్రాంచైజీ స్థానికి క్రికెటర్లకు అవకాశం ఇవ్వకుంటే వచ్చే సీజన్ నుంచి ఉప్పల్ వేదికగా ఒక్క మ్యాచ్ కూడా ఆడనివ్వమని, తానే స్వయంగా అడ్డుకుంటానని హెచ్చరించారు.

ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ క్రమంలోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ తెలుగు ప్లేయర్ అయిన నితీష్ కుమార్‌ రెడ్డికి అవకాశం కల్పించిందని ఫ్యాన్స్ సెటైర్లు పేల్చుతున్నారు.

Story first published: Friday, April 5, 2024, 20:12 [IST]
Other articles published on Apr 5, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+