Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH vs CSK: రఫ్ఫాడించిన సన్‌రైజర్స్ బౌలర్లు.. తేలిపోయిన చెన్నై సూపర్ కింగ్స్

ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 166 పరుగుల సాధారణ లక్ష్యానికే పరిమితమైంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 165 పరుగులు చేసింది.

రవీంద్ర జడేజా(24 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 45), అజింక్యా రహానే(30 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 35) టాప్ స్కోరర్లుగా నిలిచారు. సన్‌రైజర్స్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, టీ నటరాజన్, ప్యాట్ కమిన్స్, షెహ్‌బాజ్ అహ్మద్, జయదేవ్ ఉనాత్కత్ తలో వికెట్ తీసారు.

SRH vs CSK Chennai score 165 5 Dube top-scores with 45

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో రచిన్ రవీంద్ర క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దాంతో సీఎస్‌కే పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 48 పరుగులు చేసింది. ఆ వెంటనే రుతురాజ్ గైక్వాడ్(26)‌ను షెహ్‌బాజ్ అహ్మద్ ఔట్ చేయగా.. క్రీజులోకి వచ్చిన శివమ్ దూబే, అజింక్యా రహానే ధాటిగా ఆడారు.

అయితే ఈ జోడీని కమిన్స్ విడదీసాడు. శివమ్ దూబేను పెవిలియన్ చేర్చాడు. ఆ వెంటనే రహానే(35)ను ఉనాద్కత్ ఔట్ చేయడంతో సీఎస్‌కే పరుగుల వేగం తగ్గింది. జడేజా ధాటిగా ఆడినా.. మరో ఎండ్ డారిల్ మిచెల్(13) విఫలమయ్యాడు. క్రీజులోకి వచ్చిన ధోనీ 2 బంతులే ఆడి ఒక్క పరుగే చేశాడు.

Story first published: Friday, April 5, 2024, 21:27 [IST]
Other articles published on Apr 5, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+