
హైదరాబాద్: ఐపీఎల్ 2021 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. పంజాబ్ కింగ్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 9 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌కు ముందు వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిన డేవిడ్ వార్నర్ నేతృత్వంలోని ఆరెంజ్ ఆర్మీ.. ఎట్టకేలకు మంచి కాంబినేషన్‌తో బరిలోకి దిగి విజయం సాధించింది. ఈ మ్యాచ్‌కు మూడు మార్పులు చేసిన హైదరాబాద్ మేనేజ్‌మెంట్ అనుకున్న ఫలితాన్ని రాబట్టింది.
విఫలమవుతున్న మనీష్ పాండేను పక్కన బెట్టిన సన్‌రైజర్స్ అతని స్థానంలో కేదార్ జాదవ్‌ను తీసుకొచ్చింది. ఇక గాయం నుంచి పూర్తిగా కోలుకున్న కేన్ విలియమ్సన్‌ను ముజీబ్ స్థానంలో.. తొడకండరాల గాయానికి గురైన సమద్ ప్లేస్‌లో సిద్దార్థ్ కౌల్‌కు అవకాశం ఇచ్చింది.
కేన్ మామ రాకతో జట్టుకు మంచి బ్యాలెన్స్ రాగా.. సన్‌రైజర్స్ బౌలర్ల ధాటికి పంజాబ్ స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. అనంతరం జానీ బెయిర్ స్టో, డేవిడ్ వార్నర్ సూపర్ స్టార్ట్‌కు కేన్ మామ క్లాస్ ఇన్నింగ్స్ జతవ్వడంతో సునాయస విజయాన్నందుకుంది. అయితే సన్‌రైజర్స్ అభిమానులంతా కేన్ విలియమ్సన్‌ను ముద్దుగా కేన్ మామ అని పిలుచుకుంటారు. తాజాగా జట్టులోని సహచర ఆటగాళ్లు కూడా అతనికి అదే పేరును ఫిక్స్ చేశారు.
విజయానంతం టీమ్ సెలెబ్రేషన్స్‌లో భాగంగా సహచర ఆటగాళ్లంతా కేన్ మామ అంటున్న వీడియోను ఫ్రాంచైజీ పంచుకుంది. దానికి కేన్ విలియమ్సన్ అంటే లవ్.. కేన్ మామ అంటే ఏమోషన్ అని పేర్కొంది. అవును కేన్ మామ అంటే ఏమోషనేనని అభిమానులంతా కామెంట్ చేస్తున్నారు.