స్టార్ ఆటగాళ్లందరినీ వదిలేసి..
ఇక బ్యాట్స్‌మన్ లిస్ట్‌లో మనీశ్ పాండే కోసం తొలి బిడ్ వేసిన సన్‌రైజర్స్ ఆ తర్వాత కూడా అదే రితీలో స్టార్ ఆటగాళ్లందరినీ వదిలేసింది. భారీగా పర్స్‌మనీ ఉన్నప్పటికీ.. ఆటగాళ్లను కొనుగోలు చేయడంలో దూకుడు కనబర్చలేకపోయింది. ఇషాన్ కిషన్ కోసం డబ్బులను అలానే పెట్టుకున్న సన్‌రైజర్స్ చివరకు ముంబై ఇండియన్స్‌తో పోటీపడలేక చేతులెత్తేసింది. అప్పటికే టీమ్‌కు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తెలుగు ప్లేయర్లను తీసుకునేందుకు కూడా ఆరెంజ్ ఆర్మీ ఆసక్తి కనబర్చలేదు. అంబటి రాయుడు, కేఎస్ భరత్‌ల కోసం గట్టి ప్రయత్నం కూడా చేయలేదు.
పనికిరాని వారికి కోట్లు..
కానీ నికోలస్ పూరన్ కోసం రూ.10.75 కోట్లు, అభిసేక్ శర్మ కోసం ఏకంగా రూ.6.50 కోట్లు, రాహుల్ త్రిపాఠి కోసం రూ.8.50 కోట్లు అనవసరంగా ఖర్చు చేసింది. రూ. 8 కోట్ల లోపే అమ్ముడుపోయిన జానీ బెయిర్ స్టోను కాదని పూరన్‌కు సుమారు రూ.11 కోట్లు ఖర్చు చేయడం వెనుక ఉన్న వ్యూహం ఏంటో అర్థం కావడం లేదు. దాంతో అభిమానులు సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్‌పై మండిపడుతున్నారు. రాయలేని పదాలతో బండ బూతులు తిడుతున్నారు. ఈ చెత్త టీమ్‌తో టైటిల్ గెలవడం కాదు.. మ్యాచ్ గెలిచినా గొప్పేనని కామెంట్ చేస్తున్నారు.
వార్నర్ కన్నా అభిషేక్‌కు ఎక్కువా?
మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ కోసం కనీసం సన్‌రైజర్స్ బిడ్ కూడా చేయలేదు. అనూహ్యంగా వార్నర్ రూ.6.25 కోట్ల స్వల్ప ధరకే ఢిల్లీ క్యాపిటల్స్‌కు చిక్కాడు. అయితే అనామక ప్లేయర్ అభిషేక్ శర్మ కోసం హైదరాబాద్ రూ.6.50 కోట్లు చెల్లించడం అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. ఐపీఎల్‌లో ఎన్నో రికార్డులతో పాటు సింగిల్ హ్యాండ్‌తో విజయాలు అందించిన వార్నర్ కన్నా అభిషేక్ శర్మ గొప్పోడా? అని ప్రశ్నిస్తున్నారు. వేలంలో పాల్గొనేందుకు సిగ్గుండాలని ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఫన్నీ మీమ్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను తీవ్రంగా విమర్శిస్తున్నారు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్
కేన్ విలిమ్సన్(రూ.14 కోట్లు) ,
అబ్దుల్ సమద్(రూ.4 కోట్లు) ,
ఉమ్రాన్ మాలిక్(రూ.4 కోట్లు)
వాషింగ్టన్ సుంధర్(రూ.8.75 కోట్లు)
నికోలస్ పూరన్(రూ. 10.75 కోట్లు)
నటరాజన్(రూ.4 కోట్లు)
భువనేశ్వర్ కుమార్(రూ.4.2 కోట్లు)
ప్రియామ్ గార్గ్ (రూ. 20 లక్షలు)
రాహుల్ త్రిపాఠి(8.50 కోట్లు)
అభిషేక్ శర్మ(రూ.6.50 కోట్లు)


Click it and Unblock the Notifications
