
బెంగళూరు: ఐపీఎల్ 2022 మెగా వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ తీవ్ర నిరాశ పరిచింది. ఏ మాత్రం ఆలోచన లేకుండా ఆటగాళ్లను కొనుగోలు చేసింది. అవసరం వచ్చే ఆటగాళ్లను వదిలేసి అనామక ఆటగాళ్లపై కోట్లు కుమ్మరించింది. దాంతో టీమ్ చాలా బలహీనంగా కనిపిస్తోంది. బెంగళురు వేదికగా జరిగిన తొలి రోజు వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ 10 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. ఇందులో ఇద్దరు ఓవర్‌సీస్ ఆటగాళ్లను తీసుకున్న సన్‌రైజర్స్.. రూ.69.85 కోట్లు ఖర్చు చేసింది. దాంతో టీమ్‌లోని ఆటగాళ్ల సంఖ్య 13కి చేరగా.. పర్స్‌లో రూ.20.15 కోట్లు ఉన్నాయి. అసలు వేలం జరుగుతున్నంత సేపు సన్‌రైజర్స్ స్ట్రాటజీ ఏంటో ఎవరికీ అస్సలు అర్థం కాలేదు.
ఆరంభంలో ప్లేయర్ల కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ కనీసం బిడ్ కూడా వేయలేదు. స్టార్ ఆటగాళ్లందరినీ వదిలేసింది. వేలంలోకి మొదటగా వచ్చి 30 మంది ప్లేయర్లలో ఆరెంజ్ ఆర్మీ ఒక్కరిని కూడా కొనలేదు. మనీశ్ పాండే కోసం తొలి బిడ్ వేసిన సన్‌రైజర్స్.. వాషింగ్టన్ సుంధర్‌ను తొలి ఆటగాడిగా ఎంచుకుంది. మార్కీ ప్లేయర్లతో పాటు క్యాప్‌డ్ బ్యాట్స్‌మన్‌లను వదిలేసింది. ఇక ఇషాన్ కిషన్ కోసం రూ.15 కోట్ల వరకు బిడ్ వేసింది. కానీ ముంబై ఇండియన్స్‌తో పోటీ పడలేక చేతులెత్తేసింది.
ఆ తర్వాత జానీ బెయిర్ స్టో వంటి ఆటగాళ్లను కాదని నికోలస్ పూరన్‌కు ఏకంగా రూ.10.75 కోట్లకు కొనుగోలు చేసింది. అనామక అభిషేక్ శర్మకు రూ.6.5 కోట్లు తగలేసింది. గాయాలతో ఇబ్బంది పడుతున్న భువనేశ్వర్ కుమార్, నటరాజన్‌లను మళ్లీ తీసుకుంది. గత సీజన్‌లో దారుణంగా విషలమైన ప్రియామ్ గార్గ్‌ను కనీస ధరకు కొనుగోలు చేసింది.
సన్‌రైజర్స్ టీమ్:
కేన్ విలిమ్సన్(రూ.14 కోట్లు) ,
అబ్దుల్ సమద్(రూ.4 కోట్లు) ,
ఉమ్రాన్ మాలిక్(రూ.4 కోట్లు)
వాషింగ్టన్ సుంధర్(రూ.8.75 కోట్లు)
నికోలస్ పూరన్(రూ. 10.75 కోట్లు)
నటరాజన్(రూ.4 కోట్లు)
భువనేశ్వర్ కుమార్(రూ.4.2 కోట్లు)
ప్రియామ్ గార్గ్ (రూ. 20 లక్షలు)
రాహుల్ త్రిపాఠి(8.50 కోట్లు)
అభిషేక్ శర్మ(రూ.6.50 కోట్లు)
కార్తీక్ త్యాగీ (రూ.4 కోట్లు)
జగదీష సుచిత్(రూ.20 లక్షలు)
శ్రేయస్ గోపాల్(రూ. 75 లక్షలు)
ఎయిడెన్ మార్క్‌రమ్(రూ.2.60 కోట్లు)
మార్కో జాన్సెన్(రూ.4 కోట్లు)
రొమారియో షెఫెర్డ్(రూ.7,75 కోట్లు)