సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్, ఆస్ట్రేలియా సారథి ప్యాట్ కమిన్స్ మరోసారి సంచలన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. సొంతగడ్డపై పాకిస్థాన్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో అసాధారణ బ్యాటింగ్‌తో ఆసీస్‌కు శుభారంభం అందించాడు. ఈ సిరీస్‌లో భాగంగా సోమవారం జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా 2 వికెట్ల తేడాతో గెలుపొందింది.
ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో లోయరార్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన ప్యాట్ కమిన్స్ 31 బంతుల్లో 4 ఫోర్లతో 32 పరుగులతో అజేయంగా నిలిచి విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 46.4 ఓవర్లలో 203 పరుగులకు కుప్పకూలింది. బాబర్ ఆజామ్(37), మహమ్మద్ రిజ్వాన్(44), నసీమ్ షా(40) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు తీయగా.. ప్యాట్ కమిన్స్, ఆడమ్ జంపా రెండేసి వికెట్లు పడగొట్టారు. సీన్ అబాట్, మార్నస్ లబుషేన్ తలో వికెట్ తీసారు.
అనంతరం ఆస్ట్రేలియా 33.3 ఓవర్లలో 8 వికెట్లకు 204 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ప్యాట్ కమిన్స్(32 నాటౌట్)తో పాటు స్టీవ్ స్మిత్(44), జోష్ ఇంగ్లీస్(49) టాప్ స్కోరర్లుగా నిలిచారు. పాక్ బౌలర్లలో హ్యారీస్ రౌఫ్ మూడు వికెట్లు తీయగా.. షాహిన్ షా అఫ్రిది రెండు వికెట్లు పడగొట్టాడు. నసీమ్ షా, మహమ్మద్ హస్‌నైన్ తలో వికెట్ తీసారు.
లక్ష్యచేధనకు దిగిన ఆసీస్.. పాకిస్థాన్ బౌలర్ల ధాటికి తడబడింది. 185 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా సాగింది. ఈ పరిస్థితుల్లో మిచెల్ స్టార్క్‌తో కలిసి ప్యాట్ కమిన్స్ పోరాడాడు. తీవ్ర ఒత్తిడిలో అసాధారణ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. స్ట్రైకింగ్ ఎక్కువగా తీసుకొని విజయానికి కావాల్సిన 19 పరుగులు జోడించి గెలుపు లాంఛనాన్ని పూర్తి చేశాడు. ప్యాట్ కమిన్స్ సంచలన బ్యాటింగ్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఖుషి అవుతున్నారు.
ఐపీఎల్ 2025 మెగా వేలం నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్యాట్ కమిన్స్‌తో పాటు హెన్రీచ్ క్లాసెన్, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, నితీష్ కుమార్ రెడ్డిలను రిటైన్ చేసుకున్న విషయం తెలిసిందే. క్లాసెన్‌ను రూ. 23 కోట్లకు అట్టిపెట్టుకున్న సన్‌రైజర్స్ ప్యాట్ కమిన్స్‌ను రూ. 18 కోట్లకు రిటైన్ చేసుకుంది. అభిషేక్ వర్మ, ట్రావిస్ హెడ్‌లను రూ. 14 కోట్లకు తీసుకుంది. నితీష్ కుమార్ రెడ్డిని రూ. 6 కోట్ల అట్టిపెట్టుకుంది.