అలా అంటే ఎక్కడో కాల్తది.. పేస్‌తో బ్యాటర్లను వణికించడం భలే ఇష్టం: ఉమ్రాన్ మాలిక్

ముంబై: వేగవంతమైన బంతులతో బ్యాటర్లను భయపెట్టడం తనకు చాలా ఇష్టమని సన్‌రైజర్స్ హైదరాబాద్ పేస్ గన్ ఉమ్రాన్ మాలిక్ అన్నాడు. వారి హెల్మెట్లకు తగిలేలా బంతులు వేయడాన్ని మరింత ఆస్వాదిస్తానని చెప్పాడు. బ్యాటర్లు భయపడితే భారీ షాట్లు ఆడలేరని తెలిపాడు. ఎవరైనా.. నెమ్మదిగా బౌలింగ్ చేస్తున్నావని అంటే పట్టరాని కోపం వస్తుందని చెప్పిన ఈ కశ్మీర్ ఎక్స్‌ప్రెస్.. కసితో మరింత వేగంగా బంతులు వేసేందుకు సిద్దపడుతానని చెప్పుకొచ్చాడు.
ఐపీఎల్ 2021 సీజన్ సెకండాఫ్‌లో నెట్‌బౌలర్‌గా తన ప్రస్థానాన్ని మొదలు పెట్టిన ఉమ్రాన్ మాలిక్.. నటరాజన్ గాయంతో సన్‌రైజర్స్ తుది జట్టులోకి వచ్చాడు. వేగవంతమైన బంతులతో యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆకర్షించాడు. తాజా సీజన్‌లోనూ అదే జోరును కనబరుస్తున్న అతను టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచాడు. అసాధారణ ప్రదర్శనతో టీమిండియా తరఫున ఆడేందుకు అడుగు దూరంలో నిలిచాడు. సౌతాఫ్రికాతో సొంతగడ్డపై జరిగే సిరీస్‌లకు ఉమ్రాన్ మాలిక్ ఎంపికయ్యే అవకాశం ఉంది. ఆరంభంలో ధారళంగా పరుగులిచ్చినా.. మ్యాచ్ మ్యాచ్‌కు మెరగయ్యాడు.
తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉమ్రాన్ మాలిక్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. 2018లో తాను వేగంగా బంతులు వేయగలనని తెలుసుకున్నానని చెప్పాడు. '2018లో నేను టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడేవాడిని. పంజాబ్ నుంచి ఓ జట్టు జమ్మూకు వచ్చి మా లోకల్ టీమ్‌తో ఆడింది. ఆ మ్యాచ్‌లో నేను మా జట్టును గెలిపించాను. ఆ తర్వాత జమ్ము కశ్మీర్ అండర్ 19 టీమ్ ట్రయల్స్‌లో పాల్గొని సెలెక్ట్ అయ్యాను. అబ్ధుల్ సమద్‌తో కలిసి రెగ్యూలర్‌గా ప్రాక్టీస్ చేసేవాడిని. అతను నాకు చాలా సాయం చేశాడు. నా బౌలింగ్ వీడియోలు సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్ చూపించి నెట్ బౌలర్‌గా అవకాశం ఇప్పించాడు. ఆ తర్వాత నేను తుది జట్టులోకి కూడా వచ్చాను. ఇది నేను గర్వించ దగ్గ విషయం.
బ్యాటర్లను బ్యాక్ ఫుట్‌లో ఆడించడమే నా లక్ష్యం. అందుకే వారిపై బౌన్సర్‌లు సంధిస్తూ భయపెడతా. సన్‌రైజర్స్ బౌలింగ్ కోచ్ డేల్ స్టెయిన్ పర్యవేక్షణలో మరింత రాటు దేలాను. మా కెప్టెన్ కేన్ ఎప్పడూ నాకు అండగా ఉంటాడు. టీమిండియాకు ఆడటమే నా లక్ష్యం. వైవిధ్యమైన బంతులు వేయడంపై కూడా నేను ఫోకస్ పెట్టాను. స్లోయర్ బాల్, నకుల్ బాల్‌ను కూడా నేర్చుకుంటున్నాను. చిన్న పట్టణం నుంచి వచ్చిన నా గురించి అందరూ ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు. సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ నాకు అండగా నిలిచింది. 'అని ఉమ్రాన్ మాలిక్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications