ఐపీఎల్ 2021 ప్రారంభానికి ముందే సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు గట్టి ఎదురుదెబ్బ!

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్ ప్రారంభానికి ముందే సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు గట్టిషాక్ తగిలింది. ఆ జట్టు కీలక బ్యాట్స్‌మన్, న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మోచేతి గాయంతో బాధపడుతున్నాడు. దాంతో బంగ్లాదేశ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు అతను దూరమయ్యాడు. ఈ విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు దృవీకరించింది. భవిష్యత్తు టోర్నీల దృష్ట్యా విలియమ్సన్‌కు విశ్రాంతి కల్పించినట్లు తెలిపింది. ఇటీవల ఆస్ట్రేలియాతో ముగిసిన టీ20 సిరీస్‌లో విలియమ్సన్ దారుణంగా విఫలమయ్యాడు. ఐదు మ్యాచ్‌ల్లో కలిపి కేవలం 82 పరుగులు మాత్రమే చేశాడు.

విశ్రాంతి అవసరం..
అయితే ఈ వెటరన్ క్రికెటర్ ఎడమ మోచేతిలో చిన్న టియర్ ఉందని, అతనికి రిహాబిలిటేషన్ అవసరమని న్యూజిలాండ్ క్రికెట్ మెడికల్ మేనేజర్ డేలే షాకెల్ తెలిపారు. 'గత కొన్నిరోజులుగా కేన్ మోచేతి గాయంతో బాధపడుతున్నాడు. రోజులు గడుస్తున్నా దురదృష్టవశాత్తు గాయం నయమవ్వలేదు. తీరిక లేకుండా మూడు ఫార్మాట్లలో ఆడటం వల్ల అతని గాయం మరింత ఎక్కువైంది. అది పూర్తిగా నయమవ్వాలంటే ఇప్పుడు అతనికి తగిన విశ్రాంతితో పాటు రిహాబిలిటేషన్ అవసరం. వచ్చే వారం నుంచి విలియమ్సన్ రిహాబిలిటేషన్ తీసుకుంటాడు'అని షాకెల్ పేర్కొన్నారు.

కేన్ ఫిట్‌గా ఉండటం..
వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్, టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో కేన్ విలియమ్సన్ ఫిట్‌గా ఉండటం తమకెంతో అవసరమని న్యూజిలాండ్ హెడ్ కోచ్ గ్యారీ స్టెడ్ తెలిపాడు. 'దేశం తరఫున ఆడేందుకు ఇష్టపడే కేన్ విశ్రాంతి తీసుకోవడానికి వెనక్కి తగ్గడం అంత తేలికైన నిర్ణయం కాదు. ఏ బ్యాట్స్‌మెన్‌కు అయినా బ్యాటింగ్ చేసుందుకు ఎల్బో చాలా ముఖ్యం. దాంతో కేన్ గాయం నయమయ్యేందుకు ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్‌తో పాటు ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌తో భవిష్యత్తులో మా ముందు గట్టి సవాళ్లున్నాయి. ఆ సిరీస్‌ల్లోపు కేన్ ఫిట్ అవ్వడం మాకెంతో ముఖ్యం'అని న్యూజిలాండ్ కోచ్ చెప్పుకొచ్చాడు.

ఐపీఎల్ డౌటే..
ఈ లెక్కన విలియమ్సన్ ఐపీఎల్ 2021 సీజన్ ఆడటంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఒకవేళ కేన్ దూరమైతే మాత్రం సన్‌రైజర్స్‌కు గట్టి దెబ్బే. ఇప్పటికే బ్యాటింగ్ బలహీనతతో సతమతమవుతుంది. బ్యాటింగ్ భారం మొత్తం కెప్టెన్ డేవిడ్ వార్నర్, బెయిర్ స్టోలపైనే ఉంది. జూన్‌లో జరిగే వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిఫ్ ఫైనల్ కోసమే న్యూజిలాండ్ ఇంత ఆలోచిస్తుంటే.. ఇక ఏప్రిల్ 9 నుంచి ప్రారంభమయ్యే క్యాష్ రిచ్‌లీగ్‌లోఆడేందుకు కేన్ అనుమతించడం డౌట్‌గా మారింది. ఏదీ ఏమైనా కేన్ త్వరగా కోలుకోవాలని సన్‌రైజర్స్ అభిమానులు కోరుకుంటున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications