
న్యూఢిల్లీ: సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ రికార్డుల మోత మోగించాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో రాణించిన డేవిడ్ భాయ్( 55 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 57)ఏకంగా మూడు ఘనతలను సొంతం చేసుకున్నాడు.
హైదరాబాద్ ఇన్నింగ్స్ సందర్భంగా లుంగి ఎంగిడి వేసిన 15వ ఓవర్ నాలుగో బంతికి క్విక్ డబుల్ తీసిన వార్నర్ టీ20 క్రికెట్‌లో 10వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. దాంతో క్రిస్ గేల్(13, 839), కీరన్ పొలార్డ్(10,964), షోయబ్ మాలిక్(10,488) తర్వాత ఈ ఘనతను అందుకున్న నాలుగో ప్లేయర్‌గా నిలిచాడు.
ఆ మరుసటి బంతినే భారీ సిక్సర్‌గా మలిచిన డేవిడ్ భాయ్ ఐపీఎల్‌లో 200 సిక్స్‌ల క్లబ్‌చేరాడు. ఫలితంగా ఈ ఫీట్ సాధించిన ఎనిమిదవ ఆటగాడిగా... నాలుగో ఓవర్‌సీస్ ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. ఈ జాబితాలోనూ యూనివర్స్ బాస్ క్రిస్ గేల్(354) టాప్‌లో ఉండగా.. ఏబీ డివిలియర్స్(245), రోహిత్ శర్మ(222), ఎంఎస్ ధోనీ(217), విరాట్ కోహ్లీ(204), కీరన్ పొలార్డ్(202), సురేశ్ రైనా(202) వార్నర్ కన్నా ముందున్నారు.
ఇక జడేజా వేసిన 16 ఓవర్ ఐదో బంతిని మిడ్ వికెట్ మీదుగా భారీ సిక్సర్ కొట్టిన వార్నర్ 50 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దాంతో ఐపీఎల్‌లో 50 హాఫ్ సెంచరీల ఘనతను అందుకున్న తొలి క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు. వార్నర్ తర్వాత శిఖర్ ధావన్(47) సెంచరీలతో రెండో ప్లేస్‌లో ఉన్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మనీష్ పాండే(46 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 61), డేవిడ్ వార్నర్( 55 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 57) హాఫ్ సెంచరీలకు తోడుగా కేన్ విలియమ్సన్(10 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 26 నాటౌట్) మెరుపులు మెరిపించడంతో చెన్నై సూపర్ కింగ్స్ ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ 172 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.
డేవిడ్ వార్నర్, మనీష్ పాండే రెండో వికెట్‌కు 106 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 171 రన్స్ చేసింది. కేదార్ జాదవ్(4 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్‌తో 12 నాటౌట్) రాణించాడు. చెన్నై బౌలర్లలో లుంగి ఎంగిడి రెండు వికెట్లు తీయగా.. సామ్ కరన్ ఓ వికెట్ తీశాడు.