SRH Retention Players For IPL 2022: వార్నర్ ఔట్.. భువనేశ్వర్ డౌట్! సన్‌రైజర్స్ రిటైన్ చేసుకునేది ఆ నలుగురినే!

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)ను మరింత విస్తృతి పరిచే లక్ష్యంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కొత్త రెండు జట్లను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దాంతో మెగా వేలం నిర్వహణ అనివార్యమైంది. ఇప్పటికే కొత్త జట్ల ప్రక్రియను ముగించిన బీసీసీఐ మెగా వేలం నిర్వహణపై దృష్టి సారించింది. డిసెంబర్ చివరి వారంలో మెగా ఆక్షన్ నిర్వహించేందుకు ప్రణాళికలను సిద్దం చేస్తోంది. ఇప్పటికే అహ్మదాబాద్ బేస్ ఫ్రాంచైజీని సీవీసి క్యాపిటల్స్ రూ.5625 కోట్లుకు దక్కించుకోగా.. లక్నో బేస్ టీమ్‌ను రూ. 7090 కోట్లకు ఆర్‌పీఎస్‌జీ సొంతం చేసుకుంది. దాంతో ఐపీఎల్ 2022 సీజన్ పది జట్లతో ప్రేక్షకులను అలరించనుంది. ఇక మెగవేలానికి ముందు ఆటగాళ్ల రిటెన్షన్ పాలసీని సిద్దం చేసిన బీసీసీఐ అధికారికంగా ప్రకటించకపోయినా.. ఫ్రాంచైజీలకు సమాచారమిచ్చింది. నవంబర్ 30లోపు తమ రిటెన్షన్ జాబితాను అందజేయాలని ఫ్రాంచైజీలకు సూచించింది. ఆ తర్వాత మిగిలిన ఆటగాళ్ల నుంచి ముగ్గురిని ఎంచుకునే అవకాశం కొత్త జట్లకు కల్పించింది. ఈ ప్రక్రియను డిసెంబర్ తొలి వారంలో పూర్తి చేయాలని చెప్పింది.

రిటెన్షన్ రూల్స్ ఇవే..
బీసీసీఐ రూపొందించిన రిటెన్షన్ రూల్స్ ప్రకారం ఓ ఫ్రాంచైజీ గరిష్టంగా నలుగురి ఆటగాళ్లను మాత్రమే అంటిపెట్టుకునే అవకాశం ఉంది. ఇందులో ఇద్దరేసి భారత ఆటగాళ్లు, విదేశీ ఆటగాళ్లను ఎంచుకోవచ్చు. లేదా ముగ్గురు భారత్, ఒక్కరు విదేశీ ప్లేయర్‌ను తీసుకోవచ్చు. జీత భత్యాల్లో కూడా రూల్స్ పాటించాలి. నలుగురిని రిటైన్ చేసుకుంటే తొలి ఆటగాడికి రూ.16 కోట్లు, రెండో ప్లేయర్‌కు రూ. 12 కోట్లు, మూడో ప్లేయర్‌కు రూ. 8 కోట్లు, నాలుగో ప్లేయర్‌కు రూ.6 కోట్లు చెల్లించాలి. ఈ లెక్కన ఫ్రాంచైజీలు రూ.90 కోట్ల తమ పర్స్ వాల్యూ నుంచి రూ.42 కోట్లు కోల్పోవాల్సి ఉంటుంది. అయితే ఈ నిబంధనలతో ఫ్రాంచైజీల కోర్ టీమ్ చెల్లాచెదురు కానుంది. అంతేకాకుండా ప్రస్తుతం జట్టులో ఉన్న ఆటగాళ్లలో ఎవరిని తీసుకోవాలనేది కూడా ఫ్రాంచైజీలకు సవాల్‌గా మారింది. ఈ క్రమంలోనే విదేశీ ఆటగాళ్లు ఎక్కువ కలిగినసన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ రిటైన్ చేసుకునే ఆటగాళ్లు ఎవరా? అనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆ జట్టు మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ వ్యవహారం చర్చనీయాంశమైంది.

కేన్ విలియమ్సన్..
సన్‌రైజర్స్ హైదరాబాద్.. తమ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను రిటైన్ చేసుకోవడం ఖాయం. ప్రపంచంలోనే అత్యుత్తమ కెప్టెన్ అయిన కేన్‌ను వదులుకోవడానికి ఏ ఫ్రాంచైజీ ఇష్టపడదు. ఫస్ట్ స్లాబ్ ప్లేయర్‌గా రూ.16 కోట్లు చెల్లించి మరి అతన్ని రిటైన్ చేసుకునే అవకాశం ఉంది. ఐపీఎల్ 2021 సీజన్‌లో కేన్ అందుకున్న జీతం కేవలం రూ. 3 కోట్లు కాగా..వచ్చే సీజన్ అతను కనీసం 5 రెట్లు ఎక్కువగా అందుకోనున్నాడు. ఇక కేన్ విదేశీ ఆటగాడు కావడంతో సన్‌రైజర్స్ ఇద్దరేసి విదేశీ, స్వదేశీ ఆటగాళ్లను రిటైన్ చేసుకోనుంది. కెప్టెన్‌గానే కాకుండా కేన్.. ఆటగాడిగాను అదరగొట్టాడు. ఈ సీజన్‌లో 10 మ్యాచ్‌లు ఆడిన కేన్.. 266 పరుగులు చేశాడు.

రషీద్ ఖాన్..
సన్‌రైజర్స్ హైదరాబాద్.. తమ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌ను కూడా ఎట్టి పరిస్థితుల్లో వదులుకోదు. రెండో స్లాబ్ ప్లేయర్‌గా రూ.12 కోట్లు చెల్లించి రషీద్‌ను రిటైన్ చేసుకోవచ్చు. అవసరమైతే ఫస్ట్ స్లాబ్‌లో రూ.16 కోట్లు చెల్లించేందుకు కూడా సన్‌రైజర్స్ వెనుకాడదు. ఐపీఎల్ 2021 సీజన్‌లో రషీద్ రూ.9 కోట్ల వేతనాన్ని అందుకున్నాడు. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో రషీద్ కీలక ఆటగాడు. పైగా అతను వరల్డ్ క్లాస్ టీ20 స్పిన్నర్. ప్రతీ సీజన్‌లోనూ రషీద్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. ఈ సీజన్‌లో 14 మ్యాచ్‌లు ఆడిన రషీద్.. 18 వికెట్లు తీశాడు. లోయరార్డర్‌లో బ్యాటింగ్ కూడా చేయగలడు.

నటరాజన్, భువనేశ్వర్ కుమార్..
ఇక మూడో ప్లేయర్ భువనేశ్వర్ కుమార్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ తీసుకునే అవకాశం ఉంది. అయితే ఆ జట్టు ప్రధాన పేసర్ అయిన భువీ గత రెండు సీజన్లుగా గాయాలతో సతమతమవుతున్నాడు. ప్రదర్శన కూడా అంతంత మాత్రంగానే ఉంది. భారత జట్టు తరఫున కూడా పెద్దగా రాణించడం లేదు. ఈ క్రమంలోనే అతన్ని రిటైన్ చేసుకునే విషయంపై సందేహాలు నెలకొన్నాయి. అయితే భువీ అనుభవాన్ని పరిగణలోకి తీసుకుంటే అతనికి చోటు దక్కవచ్చు. ఇక సన్‌రైజర్స్ సెన్సేషన్ టీ నటరాజన్‌ను హైదరాబాద్ రిటైన్ చేసుకునే అవకాశం ఉంది. నాలుగో ఆటగాడిగా రూ.6 కోట్లు చెల్లించి అతన్ని రిటైన్ చేసుకోవచ్చు. ఐపీఎల్ 2019 వేలంలో అతన్ని రూ.20 లక్షల కనీస ధరకు తీసుకున్న హైదరాబాద్.. ఆ మరుసటి సీజన్‌లో అవకాశం ఇచ్చి ఫలితాలను రాబట్టింది. ఆ సీజన్‌లో దుమ్మురేపిన నటరాజన్.. తాజా సీజన్‌కు మాత్రం గాయంతో దూరమయ్యాడు.

డేవిడ్ వార్నర్ ఔట్..
గత కొన్నేళ్లుగా సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడిన డేవిడ్ వార్నర్‌కు ఆ ఫ్రాంచైజీతో తెగతెంపులయ్యాయి. ఐపీఎల్ 2021 సీజన్‌లో దారుణంగా విఫలమైన వార్నర్.. కెప్టెన్సీతో పాటు జట్టులో చోటు కూడా కోల్పోయాడు. కనీసం టీమ్ డగౌట్‌లోకి కూడా రాలేకపోయాడు. ఫ్రాంచైజీ యాజమాన్యంతో వచ్చిన బేధాభిప్రాయాల వల్లే వార్నర్ దూరమయ్యాడని తెలుస్తోంది. వార్నర్ సైతం సన్‌రైజర్స్ తనను రిటైన్ చేసుకోదని స్పష్టం చేశాడు. కానీ తనకు మాత్రం ఆ జట్టు తరఫున ఆడాలని ఉందని చెప్పాడు. ఇక టీ20 ప్రపంచకప్‌లో దుమ్మురేపిన వార్నర్ కోసం ఫ్రాంచైజీలు ఎగబడనున్నాయి. బహుషా అతను కొత్త జట్లలో ఓ జట్టుకు కెప్టెన్‌గా ఉండే చాన్సుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications