Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH Retention: రషీద్ ఖాన్ ఔట్.. వార్నర్, బెయిర్‌స్టో గుడ్‌బై! కేన్ మామతో కశ్మీర్ పేస్ గన్ రిటైన్!

SRH Retention 2022

న్యూఢిల్లీ: ఎంతగానో ఎదురు చూసిన ఐపీఎల్ 2022 సీజన్ రిటెన్షన్ జాబితా రానే వచ్చింది. మెగా వేలానికి ముందు ఆయా జట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) నిబంధనల మేరకు తమ ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నాయి. ఈ వివరాలు మంగళవారం ప్రకటించాయి. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ అందరూ ఊహించినట్లుగానే తమ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను రిటైన్ చేసుకుంది. అయితే అనూహ్యంగా అనామక ఆటగాళ్లు అయిన అబ్డుల్ సమద్, ఉమ్రాన్ మాలిక్‌లను కూడా అంటిపెట్టుకుంది. స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌తో డబ్బుల బేరం తేలకపోవడంతో అతన్ని వేలంలోకి వదిలేసింది.

ఊహించినట్లుగా మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఊసే సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ ఎత్తలేదు. జానీ బెయిర్ స్టోతో పాటు నటరాజన్, భువనేశ్వర్ కుమార్‌లను కూడా వదులుకుంది. రషీద్ ఖాన్‌ కోసం చివరి వరకు ప్రయత్నించిన సన్‌రైజర్స్ యాజమాన్యం అతని ఫస్ట్ స్లాబ్ ప్లేయర్‌గా తీసుకోవాలని పట్టుబట్టడంతో వదిలేసింది. ఇక రిటెన్షన్ జాబితా చెప్పే సమయంలో రషీద్ పేరు ఎత్తకుండా కొందరు ఆటగాళ్లు వేలంలోకి వెళ్లేందుకు ఇష్టపడ్డారని, వారిని అక్కడే దక్కించుకునేందుకు ప్రయత్నిస్తామని తెలిపింది. ముగ్గురు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్.. తమ రూ. 90 కోట్ల పర్స్ వాల్యూ నుంచి రూ.22 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. రూ.68 కోట్ల భారీ ధనంతో వేలంలోకి వెళ్లనుంది.

అబ్దుల్ సమద్‌తో పాటు ఉమ్రన్ మాలిక్‌లను సన్‌రైజర్స్ రిటైన్ చేసుకుంటుందని ఎవరూ కూడా ఊహించలేదు. పైగా వారిని రూ. 4 కోట్ల భారీ ధరకు చేజిక్కించుకుంది. అనూహ్యంగా జట్టులోకి వచ్చిన ఉమ్రాన్ మాలిక్.. ఒకే ఒక్క మ్యాచ్‌తో యావత్ క్రికెట్ ప్రపంచ దృష్టి ఆకర్షించాడు. ఐపీఎల్ 2021 సీజన్‌లో నెట్ బౌలర్‌గా యూఏఈకి వచ్చిన ఉమ్రాన్ మాలిక్.. నటరాజన్ గాయపడటంతో తుది జట్టులో ఆడే అవకాశాన్ని అందుకున్నాడు. నెట్స్‌లో అతని బౌలింగ్‌కు ఫిదా అయిన కేన్ విలియమ్సన్ అతనికి అవకాశమిచ్చాడు. దాన్ని మాలిక్ రెండు చేతుల అందిపుచ్చుకున్నాడు. అత్యంత వేగవంతమైన బంతులేసి యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు. ఆ పెర్ఫామెన్స్‌తోనే వచ్చే సీజన్‌కు రిటైన్ అయ్యాడు.

ఇక హార్డ్ హిట్టర్ అయిన అబ్దుల్ సమద్‌ను సన్‌రైజర్స్ రిటైన్ చేసుకుంది. చివర్లో బ్యాటింగ్‌కు దిగి హిట్టింగ్ చేసే అబ్దుల్.. ఇటీవల ముగిసిన సీజన్‌లో ఒకటి రెండు మ్యాచ్‌లు గెలిపించినంత పనిచేశాడు. దాంతో అతనికి చోటు దక్కింది. ఇక గత సీజన్లలో చేసిన తప్పిదాలను సవరించుకోవాలని హైదరాబాద్ ఫ్రాంచైజీ భావిస్తోంది.

రిటైన్ జాబితా..
కేన్ విలియమ్సన్- రూ. 14 కోట్లు
అబ్దుల్ సమద్- రూ.4 కోట్లు
ఉమ్రాన్ మాలిక్ -రూ. 4 కోట్లు

Story first published: Tuesday, November 30, 2021, 23:16 [IST]
Other articles published on Nov 30, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+