Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH Playing XI: వ్యూహాత్మక మార్పు.. RRతో ఎలిమినేటర్ మ్యాచ్ ఆడే సన్‌రైజర్స్ తుది జట్టు ఇదే!

SRH Playing XI vs RR For IPL 2026 Eliminator: ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) కీలకపోరుకు సిద్దమైంది. మంగళవారం న్యూఛండీఘర్ వేదికగా జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో ఆరెంజ్ ఆర్మీ అమీతుమీ తేల్చుకోనుంది. అద్వితీయమైన ప్రదర్శనతో ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. తృటిలో క్వాలిఫయర్-1 బెర్త్‌ను ఖరారు చేసుకున్న సంగతి తెలిసిందే.

అగ్రస్థానంలో నిలిచిన ఆర్‌సీబీ, గుజరాత్ టైటాన్స్‌తో సమంగా SRH కూడా 18 పాయింట్స్ సాధించినా.. పేలవ రన్‌రేట్‌తో మూడో స్థానానికి పరిమితమైంది. ఈ క్రమంలోనే ప్లే ఆఫ్స్ దశలో సన్‌రైజర్స్ హైదరాబాద్ హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. అంతేకాకుండా ఎలిమినేటర్ ఆడి టైటిల్ గెలిచిన ఏకైక జట్టుగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మాత్రమే రికార్డ్ ఉండటంతో ఆ జట్టుపై అంచనాలు రెట్టింపు అయ్యాయి.

అర్ష్‌దీప్ సింగ్ సంచలన నిర్ణయం!

అర్ష్‌దీప్ సింగ్ సంచలన నిర్ణయం!

2 మ్యాచ్‌ల్లోనూ ఆరెంజ్ ఆర్మీదే గెలుపు..

మరోవైపు రాజస్థాన్ రాయల్స్‌పై SRH కు మెరుగైన రికార్డ్ ఉంది. ఇరు జట్ల మధ్య 23 మ్యాచ్‌లు జరగ్గా సన్‌రైజర్స్ 14 , రాజస్థాన్ 9 మ్యాచ్‌లు గెలిచాయి. తాజా సీజన్‌లో రెండింటికి రెండు మ్యాచ్‌లు సన్‌రైజర్సే గెలిచింది. ఈ రెండింటిలోనూ భారీ విజయాలు సాధించింది. ముచ్చటగా మూడో మ్యాచ్‌లోనూ గెలిచి టైటిల్ రేసులో నిలవాలనే పట్టుదలతో ఆరెంజ్ ఆర్మీ ఉంది.

SRH Playing XI vs RR For IPL 2026 Eliminator Praful Hinge Harsh Dube In and Harshal Patel Smaran Out

ఆ సీనియర్ బౌలర్‌పై వేటు..

బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ మూడు విభాగాల్లో సత్తా చాటుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ విన్నింగ్ కాంబినేషన్‌నే కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఎలిమినేటర్ మ్యాచ్‌కు తగ్గట్లు తుది జట్టులో వ్యూహాత్మక మార్పు చేసే అవకాశం ఉంది. రాజస్థాన్ రాయల్స్‌పై మెరుగైన రికార్డ్ ఉన్న యువ పేసర్ ప్రఫుల్ హింగే రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే గత మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన హర్షల్ పటేల్‌పై వేటు వేయనున్నారు.

రాజస్థాన్ రాయల్స్ డేంజరస్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీపై ప్రఫుల్ హింగేకు మంచి రికార్డ్ ఉంది. అతన్ని కట్టడి చేసేందుకు మరోసారి ప్రఫుల్ హింగేను అస్త్రంగా వాడుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా రవిచంద్రన్ స్మరణ్ స్థానంలో హర్ష్‌దూబేను తీసుకోవచ్చు. న్యూ ఛండీఘర్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ శైలికి సరిగ్గా సూటవుతుంది. కాబట్టి ఈ రెండు మార్పులు మినహా తుది జట్టులో ఎలాంటి మార్పులు జరిగే అవకాశం లేదు.

ఎలిమినేటర్ మ్యాచ్‌కు SRH తుది జట్టు(అంచనా)

అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, హెన్రీచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, సలీల్ అరోరా, రవిచంద్రన్ స్మరణ్, పాట్ కమిన్స్, శివాంగ్ కుమార్, ఇషాన్ మలింగా, సాకిబ్ హుస్సేన్, హర్షల్ పటేల్/ప్రఫుల్ హింగే.

RCB vs GT: క్వాలిఫైయర్ మ్యాచ్‌ రద్ధు?

RCB vs GT: క్వాలిఫైయర్ మ్యాచ్‌ రద్ధు?
Story first published: Tuesday, May 26, 2026, 14:29 [IST]
Other articles published on May 26, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+