Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH Playing XI: ఆ కుర్రాడిపై వేటు.. ఆర్‌సీబీతో తలపడే సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు ఇదే!

ఐపీఎల్ 2024 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా సోమవారం జరగనున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో అమీతుమీ తేల్చుకోనుంది.

పంజాబ్ కింగ్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో సంచలన విజయాన్ని అందుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ మొత్తం 5 మ్యాచ్‌ల్లో మూడు విజయాలతో పాయింట్స్ టేబుల్‌లో ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఇదే జోరును కొనసాగించాలని ప్యాట్ కమిన్స్ సారథ్యంలో ఆరెంజ్ ఆర్మీ భావిస్తోంది.

SRH Playing XI vs RCB for IPL 2024 Washington Sundar likely to replace Mayank Markande

మరోవైపు 6 మ్యాచ్‌ల్లో ఒకే ఒక్క విజయం సాధించిన ఆర్‌సీబీ పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగు స్థానంలో నిలిచింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో తేలిపోతున్న ఆ జట్టు బౌన్స్ బ్యాక్ అవ్వడంపై ఫోకస్ పెట్టింది. సొంత అభిమానుల మధ్య సన్‌రైజర్స్‌ను ఓడించి మళ్లీ విజయాల బాట పట్టాలనుకుంటోంది.

తెలుగోడికి ప్రమోషన్..
ఈ క్రమంలోనే ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పంజాబ్ కింగ్స్‌తో తమ కాంబినేషన్‌లో పలు మార్పులు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఆ కాంబినేషన్‌నే కొనసాగించనుంది. తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డికి బ్యాటింగ్‌లో ప్రమోషన్ ఇవ్వడం.. స్టార్ ఆటగాళ్లంతా విఫలమైన వేళ అతను అసాధారణ హాఫ్ సెంచరీతో చెలరేగడం ఆరెంజ్ ఆర్మీకి కలిసొచ్చింది. అతన్ని అదే స్థానంలో ఆడించే అవకాశం ఉంది.

సుందర్‌కు అవకాశం..
అయితే బెంగళూరు పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటంతో పాటు పేసర్ల ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో సన్‌రైజర్స్ తమ స్పిన్నర్‌ను మార్చే అవకాశం ఉంది. మయాంక్ మార్కండే స్థానంలో బ్యాటింగ్ సామర్థ్యం కలిగిన వాషింగ్టన్ సుందర్‌ను ఆడించే ఛాన్స్ ఉంది. ట్రావిస్ హెడ్, నటరాజన్‌ల్లో ఒక్కరు ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడనున్నారు.

మిగతా కాంబినేషన్‌లో పెద్దగా మార్పులు చేసే అవకాశం లేదు. కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌తో పాటు ట్రావిస్ హెడ్, ఎయిడెన్ మార్క్‌రమ్, హెన్రీచ్ క్లాసెన్ ఓవర్‌సీస్ ఆటగాళ్లకు బరిలోకి దిగనున్నారు. దాంతో గ్లేన్ ఫిలిప్స్, మార్కో జాన్సెన్‌లకు మరోసారి నిరాశే ఎదురవ్వనుంది.

ముఖా ముఖి పోరు..
ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు 23 మ్యాచ్‌లు జరగ్గా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ 12, బెంగళూరు 10 మ్యాచ్‌ల్లో గెలిచాయి. మరో మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. గత 5 మ్యాచ్‌ల్లో మాత్రం బెంగళూరు మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించడం విశేషం. మరోవైపు టాస్ గెలిచి జట్టు ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. డ్యూ ప్రభావం ఉండనున్న నేపథ్యంలో చేజింగ్ టీమ్‌కు కలిసి రానుంది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు(అంచనా):
అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఎయిడెన్ మార్క్‌రమ్, హెన్రీచ్ క్లాసెన్(కీపర్), అబ్దుల్ సమద్, నితీష్ కుమార్ రెడ్డి, షెహ్‌బాజ్ అహ్మద్, ప్యాట్ కమిన్స్, జయదేవ్ ఉనాద్కత్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, టీ నటరాజన్

ఇంపాక్ట్ ప్లేయర్: రాహుల్ త్రిపాఠి, వాషింగ్టన్ సుందర్, ఉమ్రాన్ మాలిక్

Story first published: Sunday, April 14, 2024, 17:17 [IST]
Other articles published on Apr 14, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+