Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH Playing XI vs PBKS:వరుస ఓటములు.. కీలక మార్పులు! సన్‌రైజర్స్ తుది జట్టు ఇదే!

లక్నో: ఐపీఎల్ 2023 సీజన్‌‌లో వరుసగా రెండు ఓటములతో అభిమానులను తీవ్రంగా నిరాశపరిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. పంజాబ్ కింగ్స్‌తో సొంతగడ్డపై ఆదివారం జరగనున్న మ్యాచ్‌లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.

రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో చిత్తుగా ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు సొంత అభిమానుల మద్దతే కరువైంది. ఈ క్రమంలోనే పంజాబ్‌పై గెలిచి విజయాల బాట పట్టాలని ఆ జట్టు భావిస్తోంది. ఎయిడెన్ మార్క్‌రమ్ జట్టులోకి వచ్చినా.. టీమ్ కాంబినేషన్‌ మార్చినా సన్‌రైజర్స్ తలరాత మారలేదు.

SRH

పేలవ బ్యాటింగ్, చెత్త బౌలింగ్‌తో సన్‌రైజర్స్ కనీస పోటీ ఇవ్వలేక పోతుంది. ఈ క్రమంలోనే పంజాబ్‌తో జరిగే మ్యాచ్‌లోనూ సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టులో కీలక మార్పులు చేసే అవకాశం ఉంది. రూ.13.25 కోట్ల భారీ ధర పెట్టి కొనుగోలు చేసిన హరీ బ్రూక్‌పై వేటు వేసేందుకు సన్‌రైజర్స్ సిద్దమవుతోంది.

అతని స్థానంలో వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ హెన్రీచ్ క్లాసెన్‌ను ఆడించే అవకాశాలున్నాయి. తొలి రెండు మ్యాచ్‌ల్లో హరీ బ్రూక్ దారుణంగా విఫలమయ్యాడు. సింగిల్ డిజిట్‌కే వెనుదిరిగాడు. అతనికి మరో అవకాశం ఇవ్వాలనుకుంటే మాత్రం.. సన్‌రైజర్స్ అన్‌మోల్ ప్రీత్ సింగ్‌పై వేటు వేయనుంది. లక్నోతో సన్‌రైజర్స్ ముగ్గురు ఫారిన్ ప్లేయర్లతోనే బరిలోకి దిగి.. ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఫజలక్ ఫరూఖీని ఆడించింది.

బ్రూక్‌ను కొనసాగించిన హెన్రీచ్ క్లాసెన్‌ను ఆడించాలనుకుంటే ఈ వ్యూహాన్ని పక్కనపెడుతోంది. లేదంటే ఆదిల్ రషీద్‌ను తుది జట్టు నుంచి తప్పించి ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడించే చాన్స్ ఉంది. ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన మార్క్‌రమ్ డకౌట్‌గా వెనుదిరిగి తీవ్రంగా నిరాశ పరిచాడు. మయాంక్ అగర్వాల్ కూడా విఫలమయ్యాడు.

SRH

రాహుల్ త్రిపాఠి పర్వాలేదనిపించినా.. స్థాయికి తగ్గ ప్రదర్శన అయితే చేయలేదు. ప్రధాన పేసర్లుగా భువనేశ్వర్ కుమార్, టీ నటరాజన్, ఉమ్రాన్ మాలిక్ ఆడనుండగా.. ఆదిల్ రషీద్ స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా బరిలోకి దిగనున్నాడు. ఫారిన్ ప్లేయర్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడించాలనుకుంటే మాత్రం మార్కో జాన్సెన్ బరిలోకి దిగవచ్చు.

సన్‌రైజర్స్ హైదరబాద్ తుది జట్టు(అంచనా)

అ‌న్‌మోల్ ప్రీత్ సింగ్, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్క్‌రమ్, హరీ బ్రూక్/ హెన్రీచ్ క్లాసెన్, వాషింగ్టన్ సుందర్, అబ్దుల్ సమద్, భువనేశ్వర్ కుమార్, అబ్దుల్ రషీద్, ఉమ్రాన్ మాలిక్, టీ నటరాజన్

ఇంపాక్ట్ ప్లేయర్: ఫజలక్ ఫరూఖీ/ మార్కో జాన్సెన్

Story first published: Saturday, April 8, 2023, 17:14 [IST]
Other articles published on Apr 8, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+