ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) మరో కీలక పోరుకు సిద్దమైంది. శనివారం మధ్యాహ్నం 3.30 గంటలకు ముల్లాన్‌పూర్ వేదికగా జరిగే మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తో ఆరెంజ్ ఆర్మీ అమీతుమీ తేల్చుకోనుంది. వరుస విజయాలతో ఓటమి ఎరుగని జట్టుగా జోరు మీదున్న పంజాబ్ కింగ్స్‌కు కళ్లెం వేయాలనే పట్టుదలతో సన్‌రైజర్స్ హైదరాబాద్ బరిలోకి దిగుతోంది. గత మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ మళ్లీ విజయాల బాట పట్టాలనే పట్టుదలతో ఉంది.
ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ తుది జట్టులో కీలక మార్పు చేసే అవకాశం ఉంది. లక్నోతో మ్యాచ్‌లో దారుణంగా విఫలమైన లియామ్ లివింగ్‌స్టోన్‌పై వేటు వేసి అతని స్థానంలో బ్రైడన్ కార్స్‌ను ఆడించే ఛాన్స్ ఉంది. అయితే ఈ మ్యాచ్ మధ్యాహ్నం ఉండటంతో పిచ్ స్లో బౌలర్లకు సహకరించే ఛాన్స్ ఉంది. ఈ లెక్కన స్పిన్నర్ అయిన లివింగ్ స్టోన్‌ను కొనసాగించాలని భావిస్తే అతను తుది జట్టులో కొనసాగుతాడు. లేదంటే అతనికి ఉద్వాసన తప్పదు. ఈ ఒక్కటి మినహా తుది జట్టులో ఎలాంటి మార్పులు జరిగే అవకాశం లేదు.

ఐపీఎల్ 2026 మినీ వేలంలో రూ.13 కోట్ల భారీ ధరకు లివింగ్ స్టోన్‌ను కొనుగోలు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలి రెండు మ్యాచ్‌ల్లో అవకాశం ఇవ్వలేదు. కానీ సొంతగడ్డపై లక్నో జరిగిన మ్యాచ్‌లో అవకాశం ఇవ్వగా.. అతను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమైన అతను ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయలేదు. దాంతోనే అతనికి ఉద్వాసన పలకాలనే ఉద్దేశంలో సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్ ఉన్నట్లు తెలుస్తోంది.

కోల్‌కతాలో వర్షం కారణంగా అర్ధాంతరంగా ఆగిపోయిన తమ జోరును.. సొంతగడ్డపై నుంచి మళ్లీ కొనసాగించాలనే యోచనలో పంజాబ్ కింగ్స్ ఉంది. బలమైన బ్యాటింగ్, బౌలింగ్‌తో పంజాబ్ కింగ్స్ పటిష్టంగా ఉంది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ తరహాలో.. పంజాబ్ కింగ్స్‌కు ప్రభ్‌సిమ్రాన్ సింగ్, ప్రియాన్ష్ ఆర్యలతో డేంజరస్ ఓపెనింగ్ కాంబో ఉంది. ఈ ఇద్దరూ గతేడాది పరుగుల మోత మోగించారు. ఆర్య 179.42 స్ట్రైక్ రేట్‌తో 475 పరుగులు చేయగా.. ప్రభ్‌సిమ్రాన్ 160.52 స్ట్రైక్ రేట్‌తో 549 పరుగులు సాధించాడు.
ఇది డే గేమ్ కావడంతో, పిచ్ స్లో బౌలర్లకు సహకరించే అవకాశం ఉంది. దీంతో పంజాబ్ కింగ్స్ జట్టు విజయ్‌కుమార్ వైషాక్ స్థానంలో అదనపు స్పిన్నర్ హర్‌ప్రీత్ బ్రార్‌ను తీసుకునే అవకాశం ఉంది. ఈ ఒక్కటి మినహా తుది జట్టులో పెద్దగా మార్పులు జరిగే అవకాశం లేదు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH):
అభిషేక్ శర్మ, 2. ట్రావిస్ హెడ్, 3. ఇషాన్ కిషన్, 4. హెన్రిచ్ క్లాసెన్, 5. నితీష్ కుమార్ రెడ్డి, 6. లియామ్ లివింగ్‌స్టోన్/బ్రైడన్ కార్స్, 7. అనికేత్ వర్మ, 8. ఈషన్ మలింగ, 9. హర్షల్ పటేల్, 10. హర్ష్ దూబే, 11. జయదేవ్ ఉనద్కత్, 12. శివాంగ్ కుమార్.
పంజాబ్ కింగ్స్ (PBKS):
ప్రియాన్ష్ ఆర్య, 2. ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (కీపర్), 3. కూపర్ కానలీ, 4. శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), 5. నెహాల్ వధేరా, 6. శశాంక్ సింగ్, 7. మార్కస్ స్టోయినిస్, 8. మార్కో జాన్సెన్, 9. జేవియర్ బార్ట్లెట్, 10. అర్ష్‌దీప్ సింగ్, 11. విజయ్‌కుమార్ వైషాక్/హేమంత్ బ్రార్, 12. యుజ్వేంద్ర చహల్.
