For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

SRH Playing XI: ఆ కల్ప్రిట్‌పై వేటు.. పంజాబ్‌తో తలపడే సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు ఇదే!

ఐపీఎల్ 2025 సీజన్‌లో వరుస పరాజయాలతో చతికిల పడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో కీలక పోరుకు సిద్దమైంది. శనివారం(ఏప్రిల్ 12) ఉప్పల్ మైదానం వేదికగా జరిగే మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. టైటిల్ అవకాశాలు సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్ గెలవడం సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు అత్యంత కీలకం. వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఓడి తీవ్ర నిరాశలో ఉన్న జట్టుకు ఈ మ్యాచ్‌ చావో రేవోగా మారింది. గెలిస్తే.. రెట్టించిన ఆత్మవిశ్వాసంతో మళ్లీ విజయాల బాట పట్టి ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవచ్చు. ఓడితే మాత్రం జట్టులోని ఆటగాళ్లతో పాటు అభిమానులు మరింత నిరాశకు గురవ్వనున్నారు.

వైల్డ్ ఫైర్ బ్యాటింగ్..
వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓడటంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగు స్థానంలో నిలిచింది. జట్టు ప్రధాన బలమైన బ్యాటింగే.. బలహీనంగా మారడం సన్‌రైజర్స్ కొంపముంచుతోంది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మల వైఫల్యం జట్టుకు తీవ్ర నష్టం చేస్తోంది. ఈ ఇద్దరూ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగితేనే.. జట్టు తిరిగి విజయాల బాట పట్టనుంది.

మరోవైపు పంజాబ్ కింగ్స్ 4 మ్యాచ్‌ల్లో మూడు గెలిచి మంచి జోష్‌లో ఉంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరహాలోనే విధ్వంసకర బ్యాటర్లు ఆ జట్టులో ఉన్నారు. బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగానే ఉంది. ఫీల్డింగ్ మెరుగుపరుచుకుంటే ఆ జట్టుకు తిరుగుండదు. ఇరు జట్ల బ్యాటింగ్ లైనప్ భీకరంగా ఉండటం.. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే ఉప్పల్‌లో మ్యాచ్ జరుగుతుండటంతో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

SRH Playing XI Vs PBKS For IPL 2025 Simarjeet Singh Out And Rahul Chahar In

ఆ కల్ప్రిట్‌పై వేటు..
గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో జట్టు ఓటమికి కారణమైన సిమర్జిత్ సింగ్‌పై వేటు పడనుంది. ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన సిమర్జిత్ సింగ్.. స్లో వికెట్‌పై ఒకే ఓవర్‌లో 20 పరుగులు సమర్పించుకొని జట్టు ఓటమికి కారణమయ్యాడు. ఈ క్రమంలోనే అతన్ని పక్కన పెట్టి అతని స్థానంలో రాహుల్ చాహర్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడించ్చు. ఒకవేళ ఆడమ్ జంపాను ఆడించాలనుకుంటే కామిందు మెండీస్‌పై వేటు పడనుంది. అప్పుడు రాహుల్ చాహర్ కూడా బెంచ్‌కే పరిమితమవుతాడు.

జ్వరం నుంచి హర్షల్ పటేల్ కోలుకుంటే.. జయదేవ్ ఉనాద్కత్ స్థానంలో అతను రీఎంట్రీ ఇస్తాడు. పిచ్ కండిషన్స్ బట్టి సన్‌రైజర్స్ తుది జట్టులో మార్పులు చేయనుంది. వికెట్ పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటే ఎక్స్‌ట్రా బ్యాటర్‌తో బరిలోకి దిగనుంది. స్లోగా ఉంటే మాత్రం ఎక్స్‌ట్రా స్పిన్నర్‌తో బరిలోకి దిగుతారు. బ్యాటింగ్‌ విభాగంలో పెద్దగా మార్పులు చేసే ఛాన్స్ అయితే లేదు.

ఎక్స్‌ట్రా బ్యాటర్..? స్పిన్నర్..?
ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఆడనున్నారు. ఈ ఇద్దరూ శుభారంభం అందించాల్సిన అవసరం ఉంది. పవర్ ప్లే పూర్తయ్యే వరకు ఆడినా సరిపోతుంది. తొలి మ్యాచ్‌లోనే సెంచరీ బాదిన ఇషాన్ కిషన్ తర్వాతి నాలుగు మ్యాచ్‌ల్లో విఫలమయ్యాడు. అతను ఓ పెద్ద ఇన్నింగ్స్ బాకీ ఉన్నాడు. నితీష్ కుమార్ రెడ్డి గతేడాదిలా రాణించలేకపోతున్నాడు. హెన్రీచ్ క్లాసెన్‌, అనికేత్ వర్మ మెరుపులు మెరిపిస్తున్నా.. జట్టు విజయానికి సరిపోవడం లేదు. ఎక్స్‌ట్రా బ్యాటర్‌ను ఆడిస్తే అభినవ్ మనోహర్, అథర్వ టైడ్, సచిన్ బేబీలో ఒకరికి అవకాశం దక్కనుంది. ప్యాట్ కమిన్స్, మహమ్మద్ షమీ, ఫిట్‌గా ఉంటే హర్షల్ పటేల్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా జీషన్ అన్సారీ ఆడనుండగా.. ఆడమ్ జంపా/రాహుల్ చాహర్‌లను ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడించవచ్చు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు (అంచనా):

అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రీచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, కామిందు మెండీస్/ అభినవ్ మనోహర్/సచిన్ బేబీ, ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్/జయదేవ్ ఉనాద్కత్, మహమ్మద్ షమీ, జీషన్ అన్సారీ.

ఇంపాక్ట్ ప్లేయర్: ఆడమ్ జంపా/రాహుల్ చాహర్.

Story first published: Friday, April 11, 2025, 12:15 [IST]
Other articles published on Apr 11, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+