Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH Playing XI vs MI: రూ.8.25 కోట్ల ఆటగాడిపై వేటు? ముంబైతో ఆడే సన్‌రైజర్స్ తుది జట్టు ఇదే!

కోల్‌కతా: ఐపీఎల్ 2023 సీజన్‌లో రెండు వరుస విజయాలతో జోరు మీదున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. మంగళవారం ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. రెండు వరుస ఓటములతో టోర్నీని ప్రారంభించిన సన్‌రైజర్స్.. ఆ తర్వాత పంజాబ్ కింగ్స్‌, కేకేఆర్ జట్లను మట్టికరిపించింది.

హ్యారీ బ్రూక్ వంటి ఆటగాళ్లు ఫామ్‌లోకి రావడంతో సన్‌రైజర్స్ పటిష్టంగా కనబడుతోంది. మరోవైపు ముంబై సైతం సన్‌రైజర్స్ తరహాలోనే తొలి రెండు మ్యాచ్‌లు ఓడి తర్వాతి మ్యాచ్‌ల్లో వరుస విజయాలందుకొని జోరు మీద ఉంది. దాంతో ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు జరగనుంది. మరో థ్రిల్లింగ్ మ్యాచ్ అభిమానులను కనువిందు చేయనుంది.

SRH Playing XI vs MI

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో స్టార్ ఆటగాళ్లంతా ఫామ్‌లోకి రావడం కలిసొచ్చే అంశం కాగా.. చెత్త ఫీల్డింగ్ అభిమానులను ఆందోళన పరుస్తోంది. కేకేఆర్‌తో మ్యాచ్‌లో ఐదు క్యాచ్‌లను సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు నేలపాలు చేశారు. స్టార్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ ఫామ్ కూడా జట్టును కలవరపెడుతోంది. నాలుగు ఇన్నింగ్స్‌ల్లో కలిపి అతను 30 పరుగులు కూడా చేయలేదు. ఈ క్రమంలోనే అతనిపై వేటు వేస్తారనే ప్రచారం జరుగుతోంది.

అయితే రూ.8.25 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన మయాంక్ అగర్వాల్‌కు టీమ్‌మేనేజ్‌మెంట్ అండగా నిలిచే అవకాశం ఉంది. హ్యారీ బ్రూక్ తరహాలోనే అతనికి మద్దతు ఇవ్వనున్నారు. ఒకవేళ పక్కకు పెట్టాలనుకుంటే మాత్రం అభిషేక్ శర్మ ఓపెనర్‌గా బరిలోకి దిగనుండగా.. అబ్దుల్ సమద్ తుది జట్టులోకి వస్తాడు.

బౌలింగ్‌లో కూడా పెద్దగా మార్పులు చేసే అవకాశం లేదు. పరిస్థితులకు తగ్గట్లు వాషింగ్టన్ సుందర్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా వాడుకోనున్నారు. అతను కూడా ఫామ్‌లోకి రావడం చాలా ముఖ్యం. గత మ్యాచ్‌లో సెంచరీతో హ్యారీ బ్రూక్ ఫామ్‌లోకి రాగా.. రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్క్‌రమ్ కూడా ఫుల్ జోష్‌లో ఆడుతున్నారు. మయంక్ అగర్వాల్ కూడా టచ్‌లోకి వస్తే సన్‌రైజర్స్ బ్యాటింగ్‌కు తిరుగుండదు.

బౌలింగ్‌లో మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే అదరగొడుతుండగా.. నటరాజన్, ఉమ్రాన్ మాలిక్ తమ మార్క్ చూపించుకోవాల్సిన అవసరం ఉంది.

ముంబైతో సన్‌రైజర్స్ హైదరబాద్ తుది జట్టు(అంచనా)

మయాంక్ అగర్వాల్, హ్యారీ బ్రూక్, రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్క్‌రమ్(కెప్టెన్), అభిషేక్ శర్మ, హెన్రీచ్ క్లాసెన్, మార్కో జాన్సెన్, మాయంక్ మార్కండే, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, టీ నటరాజన్

ఇంపాక్ట్ ప్లేయర్: అబ్దుల్ సమద్, వాషింగ్టన్ సుందర్

Story first published: Monday, April 17, 2023, 18:06 [IST]
Other articles published on Apr 17, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+