For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

SRH Playing XI: రూ. 10 కోట్ల ఆటగాడిపై వేటు.. ముంబైతో తలపడే సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు ఇదే!

ఐపీఎల్ 2025 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ రివేంజ్ ఫైట్‌కు సిద్దమైంది. బుధవారం ఉప్పల్ మైదానం వేదికగా జరిగే మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. గత మ్యాచ్‌లో ముంబై చేతిలోనే ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ప్రతీకారం తీర్చుకోవాలనే కసితో ఉంది. అచ్చొచ్చిన హోమ్ గ్రౌండ్‌లో ముంబైని మట్టికరిపించి మళ్లీ విజయాల బాట పట్టాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు హ్యాట్రిక్ విజయాలతో జోరు మీదున్న ముంబై ఇండియన్స్.. అదే ఆధిపత్యం కొనసాగించాలనుకుంటోంది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ఫామ్‌లోకి రావడం.. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే ఉప్పల్ వికెట్‌పై మ్యాచ్ జరగనుండటంతో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

రూ. 10 కోట్ల ఆటగాడిపై వేటు..?
వరుస విజయాలతో చతికల పడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ తీవ్ర ఒత్తిడిలో ఉంది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్‌లపై జట్టు మొత్తం ఆధారపడి ఉంది. ఈ ఇద్దరూ ఆడితేనే విజయం లేదంటే ఓటమి అన్నట్లుగా ఉంది ఆరెంజ్ ఆర్మీ పరిస్థితి. బౌలింగ్ విభాగంలో మహమ్మద్ షమీ తేలిపోతుండటం జట్టుకు తీవ్ర నష్టం చేస్తోంది. బ్యాటింగ్ విభాగంలో ఇషాన్ కిషన్, నితీష్ రెడ్డి ఘోర వైఫల్యం కూడా జట్టు విజయవకాశాలను దెబ్బతీస్తోంది. స్టార్ ఆటగాళ్ల వైఫల్యం నేపథ్యంలో తుది జట్టులో మార్పులు జరుగుతాయా? అంటే కచ్చితంగా అవునని చెప్పలేని పరిస్థితి నెలకొంది.

SRH Playing XI vs MI For IPL 2025 Mohammed Shami and Ishan Kishan Out

ఇషాన్ కిషన్, మహమ్మద్ షమీ, నితీష్ కుమార్ రెడ్డిలను భర్తీ చేసే ప్రత్యామ్నాయ ఆటగాళ్లు జట్టులో లేరు. రూ. 10 కోట్లు, రూ. 11.25 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన షమీ, ఇషాన్ కిషన్‌ దారుణంగా విఫలమవుతున్నారు. ఈ ఇద్దర్నీ తుది జట్టులో నుంచి తప్పించాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. కానీ వారి స్థానాల్లో ఎవర్నీ ఆడించాలనేది? మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. సన్‌రైజర్స్ బెంచ్ మొత్తం అనామక ఆటగాళ్లతో నిండిపోయి ఉంది. జయదేవ్ ఉనాద్కత్ ఉన్నా.. అతను షమీకి ప్రత్యామ్నాయంగా నిలుస్తాడా? అంటే అవునని చెప్పలేని పరిస్థితి.

ఏకైక మార్పుతోనే..!
ఇంపాక్ట్ ప్లేయర్ విషయం మినహా తుది జట్టులో మార్పు చేయలేని పరిస్థితి సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు నెలకొంది. గత మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా రాహుల్ చాహర్‌‌ను ఆడించగా అతను ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. అప్‌కమింగ్ మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా అభినవ్ మనోహర్ లేదా స్మరన్ రవిచంద్రన్‌ను ఆడించే అవకాశం ఉంది. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఓపెనర్లుగా ఆడనుండగా.. ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రీచ్ క్లాసెన్, అనికేత్ వర్మ మిడిలార్డర్‌లో ఆడనున్నారు. ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్, మహమ్మద్ షమీ, జీషన్ అన్సారీ, ఇషాన్ మలింగా బౌలింత్ బాధ్యతలు పంచుకోనున్నారు. టాపార్డర్ చెలరేగితేనే ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ విజయం సాధిస్తుంది. లేదంటే మరో పరాజయం తప్పదు. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే ఆరెంజ్ ఆర్మీ ప్లే ఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉంటాయి.

ముంబైతో పోరు.. సన్‌రైజర్స్ తుది జట్టు ఇదే:
అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రీచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్, మహమ్మద్ షమీ, జీషన్ అన్సారీ, ఇషాన్ మలింగా.

ఇంపాక్ట్ ప్లేయర్: అభినవ్ మనోహర్, స్మరన్ రవిచంద్రన్.

Story first published: Tuesday, April 22, 2025, 9:01 [IST]
Other articles published on Apr 22, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+