For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

SRH Playing XI vs LSG: రూ.13 కోట్ల ఆటగాడు రీఎంట్రీ.. లక్నోతో ఆడే సన్‌రైజర్స్ జట్టు ఇదే!

హైదరాబాద్: ఐపీఎల్ 2023 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ మరో కీలకపోరుకు సిద్దమైంది. శనివారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఉప్పల్ వేదికగా జరగనున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో ఆరెంజ్ ఆర్మీ అమీతుమీ తేల్చుకోనుంది. రాజస్థాన్ రాయల్స్‌తో గత మ్యాచ్‌లో ఆఖరి బంతికి నోబాల్‌తో ఓటమిని తప్పించుకున్న సన్‌రైజర్స్.. అదే జోరు కొనసాగించాలనుకుంటోంది.

ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే సన్‌రైజర్స్ ఆడే చివరి నాలుగు మ్యాచ్‌ల్లో ప్రతీది గెలవాలి. ఈ క్రమంలోనే లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌ సన్‌రైజర్స్‌కు చాలా కీలకం. మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్ సైతం.. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే చివరి మూడు మ్యాచ్‌ల్లో కనీసం రెండు భారీ విజయాలందుకోవాలి. దాంతో ఉప్పల్ వేదికగా జరిగే పోరు హోరాహోరీగా ఉండనుంది.

Harry Brook

పేలవ ప్రదర్శనతో రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌కు జట్టులో కీలక మార్పులు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. అదే కాంబినేషన్‌ను లక్నోతో కొనసాగించే అవకాశం ఉంది. అయితే బ్యాటింగ్‌ను బలోపేతం చేయాలనుకున్నా.. రూ.13.25 కోట్ల హ్యారీ బ్రూక్‌కు మరో అవకాశం ఇవ్వాలనుకున్నా... ఓవర్‌సీస్ బౌలర్ మార్కో జాన్సెన్‌పై వేటు పడనుంది

గత మ్యాచ్‌లో బ్రూక్ స్థానంలో బరిలోకి దిగిన గ్లేన్ ఫిలిప్స్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 7 బంతుల్లోనే 3 సిక్సర్లతో 25 పరుగులు చేసి విజయానికి బాటలు వేసాడు. ఈ సూపర్ ఇన్నింగ్స్ ఫిలిప్స్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.

ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఓపెనర్‌గా బరిలోకి దిగిన అన్‌మోల్ ప్రీత్ సింగ్ కూడా సత్తా చాటాడు. అభిషేక్ శర్మకు తోడుగా మంచి ఆరంభాన్ని అందించాడు. దాంతో మరోసారి ఇదే ఓపెనింగ్ కాంబినేషన్‌ను కొనసాగించే అవకాశం ఉంది.

ఫస్ట్ డౌన్‌లో రాహుల్ త్రిపాఠి ఆడనుండగా.. మిడిలార్డర్‌లో హెన్రీచ్ క్లాసెన్, ఏయిడిన్ మార్క్‌రమ్, గ్లేన్ ఫిలిప్స్ ఆడనున్నారు. అబ్దుల్ సమద్ ఫినిషర్ పాత్ర పోషించనున్నాడు. బ్రూక్ జట్టులోకి వస్తే మాత్రం మార్కో జాన్సెన్‌‌తో పాటు వివ్రాంత్ శర్మపై వేటు పడనుంది. ఎక్స్‌ట్రా పేసర్‌గా ఉమ్రాన్ మాలిక్ లేదా కార్తీక్ త్యాగీ ఆడనున్నారు.

భువనేశ్వర్ కుమార్ పేస్ బాధ్యతలు పంచుకోనుండగా.. మాయంక్ మార్కండే స్పిన్నర్‌గా ఆడనున్నాడు. నటరాజన్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఉపయోగించుకోనున్నారు.

లక్నో‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు (అంచనా):
అన్‌మోల్ ప్రీత్ సింగ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, హెన్రీచ్ క్లాసెన్, ఎయిడెన్ మార్క్‌రమ్, గ్లేన్ ఫిలిప్స్, అబ్దుల్ సమద్, మార్కో జాన్సెన్/హ్యారీ బ్రూక్, వివ్రాంత్ శర్మ/ఉమ్రాన్ మాలిక్, మయాంక్ మార్కండే, భువనేశ్వర్ కుమార్

ఇంపాక్ట్ ప్లేయర్: నటరాజన్

Story first published: Friday, May 12, 2023, 18:09 [IST]
Other articles published on May 12, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+